https://oktelugu.com/

‘ఆరు సంవత్సరాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి’

  తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ… భారతదేశంలో మునుపెన్నడూ జరగని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ శాంతియుత పోరాటం జరిపి రాష్ర్టాన్ని సాధించుకున్నారన్నారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పథకాలలో సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం మారిందని తమిళ్ సై అన్నారు. ప్రజల సంతోషం, సంతృప్తియే ప్రభుత్వ పనితనానికి కొలమానమన్నారు. ప్రజల […]

Written By: , Updated On : June 2, 2020 / 03:11 PM IST
Follow us on

 

Telangana formation day

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ… భారతదేశంలో మునుపెన్నడూ జరగని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ శాంతియుత పోరాటం జరిపి రాష్ర్టాన్ని సాధించుకున్నారన్నారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పథకాలలో సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం మారిందని తమిళ్ సై అన్నారు.

ప్రజల సంతోషం, సంతృప్తియే ప్రభుత్వ పనితనానికి కొలమానమన్నారు. ప్రజల బలమైన భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ అతి త్వరలోనే ఆవిషృతమౌతుందన్నారు. కోవిడ్‌-19 క్లిష్ట పరిస్థితిని ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణను సంపన్న, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా నిలపడంలో మనందరం తప్పక విజయం సాధిస్తామని పేర్కొన్నారు.