https://oktelugu.com/

తెలంగాణ ఆవిర్భావం రోజున సింగరేణిలో విషాదం

నేటితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఏడోపడిలోకి తెలంగాణ రాష్ట్రం అడుగుపెడుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడబరంగా జరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రమంతటా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుండగా మరోవైపు సింగరేణిలో విషాదం నెలకొనడం శోచనీయంగా మారింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో సోమవారం ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ జరగడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం. సింగరేణికి చెందిన ఓపెన్ కాస్ట్-1లో సోమవారం కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 2, 2020 / 03:07 PM IST
    Follow us on

    నేటితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఏడోపడిలోకి తెలంగాణ రాష్ట్రం అడుగుపెడుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడబరంగా జరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రమంతటా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుండగా మరోవైపు సింగరేణిలో విషాదం నెలకొనడం శోచనీయంగా మారింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో సోమవారం ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ జరగడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.

    సింగరేణికి చెందిన ఓపెన్ కాస్ట్-1లో సోమవారం కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఫేజ్-2లో బ్లాస్టింగ్‌కు సంబంధించి ముడి పదార్థాలను నింపుతుండగా ప్రమాదవశాత్తూ భారీ సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి కార్మికుల శరీరాలు ఛిద్రమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. దీంతో సింగరేణిలో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

    ఇదిలా ఉండగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తున్నక్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తున్న క్రమంలో అంగన్ వాడీ టీచర్ భర్త అశోక్(32) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. జెండా ఆవిష్కరణకు ఐరన్ పొల్ పాతుతున్న క్రమంలో విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగడలంతో విద్యుత్ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రజలంతా సంబరాలు చేసుకుంటుండగా రెండుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడం శోచనీయంగా మారింది.