Omicron: కరోనా ప్రభావంతో ప్రపంచం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. విద్యావ్యవస్థకైతే తీవ్ర నష్టం వాటిల్లింది. కేసుల సంఖ్య పెరగడంతో మొదటి, రెండో దశలో విద్యార్థులు ఇళ్లకే పరిమితమై ఆన్ లైన్ తరగతులతోనే కాలం గడిపారు. ఈ విద్యా సంవత్సరంలోనే విద్యాబోధనపై ప్రభుత్వం చొరవ చూపినా ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ భయం పట్టుకుంది. కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్కూళ్లు మళ్లీ మూత పడతాయనే పుకార్లు షికార్లు చేస్తున్న సందర్భంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం రాష్ర్టంలో లేనందున పాఠశాలల మూసివేత ఉండదని మంత్రి చెప్పడం గమనార్హం. కానీ సామాజిక మాధ్యమాల్లో తెలంగాణలో కూడా పాఠశాలల మూత ఉంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళణ చెందుతున్నారు. దీంతో పాఠశాలల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా ప్రభావంతో పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి కూడా వ్యాక్సిన్ వేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఇప్పటికే విద్యావ్యవస్థకు జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్టంలో కరోనా ముప్పు తొలగించుకునే చర్యల్లో భాగంగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. థర్డ్ వేవ్ ప్రచారం కూడా రావడంతో పాఠశాలల నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి.
Also Read: Omicron Variant: ‘ఒమిక్రాన్’ భయం: దేశంలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?
మరోవైపు పాఠశాలల్లో కూడా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు వాడుతూ శానిటైజర్ పూసుకుంటూ ఎప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. వైరస్ బారి నుంచి రక్షించుకునే క్రమంలో ప్రభుత్వం కూడా అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. వైరస్ ను తుదముట్టించే క్రమంలో విద్యాశాఖ కూడా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం జాగ్రత్తలు పాటిస్తోంది.
Also Read: Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ కాబోయే సీఎం ఎవరంటే.? సంచలన సర్వే