https://oktelugu.com/

Actress Lahari: యాక్సిడెంట్ చేసిన గృహలక్ష్మి సీరియల్ నటి లహరి…

Actress Lahari: బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో, పలు సినిమాల్లో నటించి అలరించింది నటి లహరి. ‘మొగలి రేకులు’ సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న లహరి ఆ తర్వాత చాలా సీరియల్స్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కూడా కొన్ని సీరియల్స్ తో పాటు యూట్యూబ్ లోను వీడియోలు చేస్తుంది. స్టార్ మా లో ప్రసార్మ్ అవుతున్న “గృహలక్ష్మి” సీరియల్ లో ఆమె నటిస్తుంది. కాగా తాజాగా లహరి యాక్సిడెంట్ కేసులో అరెస్టు అయ్యింది. ఆమె […]

Written By: , Updated On : December 8, 2021 / 10:19 AM IST
Follow us on

Actress Lahari: బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో, పలు సినిమాల్లో నటించి అలరించింది నటి లహరి. ‘మొగలి రేకులు’ సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న లహరి ఆ తర్వాత చాలా సీరియల్స్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కూడా కొన్ని సీరియల్స్ తో పాటు యూట్యూబ్ లోను వీడియోలు చేస్తుంది. స్టార్ మా లో ప్రసార్మ్ అవుతున్న “గృహలక్ష్మి” సీరియల్ లో ఆమె నటిస్తుంది. కాగా తాజాగా లహరి యాక్సిడెంట్ కేసులో అరెస్టు అయ్యింది. ఆమె కారులో శంషాబాద్ నుంచి వస్తూ ఎదురుగా వస్తున్న ఓ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వ్యక్తి రక్తమోడుతున్నా కూడా కనీసం లహరి కారులోంచి దిగక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్థానికులంతా ఆమెపై మండిపడ్డారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

Actress Lahari

Actress Lahari

Also Read: నవ్వుల రారాజు బ్రహ్మానందంను నవ్వించే వ్యక్తి ఎవరో తెలుసా?
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కారుతో సహా స్టేషన్‌కు తీసుకెళ్లారు. లహరి మద్యం తాగి వాహనం నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు ఇంతవరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కాగా బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి అని తెలుస్తోంది. డ్యూటీ ముగించుకుని బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో లహరి కారుతో ఢీ కొట్టింది. సదరు వ్యక్తి కిందపడి గాయాలపాలైనా కూడా, లహరి కారు దిగకపోవడంతో మిగతా వాహనదారులు, స్థానికులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Also Read: కార్తీకదీపం లో మరో ట్విస్ట్.. కుటుంబంతో రోడ్డున పడ్డ డాక్టర్ బాబు!