ఆక్సిజన్ కొరతను గుర్తించి
దేశమంతా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజంతా భయాందోళనకు గురవుతున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది. దీంతో ఆక్సిజన్ అవసరాలను గుర్తించిన పట్నాయక్ దాన్ని సరఫరా చేసేందుకు నడుం బిగించారు. ఆక్సిజన్ అవసరమైన స్టేట్లకు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ సాయాన్ని పలువురు కీర్తిస్తున్నారు. ఆపద సమయంలో ఆదుకునే దేవుడిగా అభివర్ణిస్తున్నారు.
రాజకీయాలంటే పెద్దగా పట్టించుకోరు
నవీన్ పట్నాయక్ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోరు. వాటిని తృణప్రాయంగా భావిస్తారు. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రచారం చేస్తారు. మిగతా టైంలో ప్రజాసేవకే మొగ్గు చూపుతారు. అందుకే ఆయన పోటీ చేసిన ప్రతిసారి విజయం సాధిస్తారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయన నిష్కళంక మనస్థత్వంతోనే రాజకీయంగా రాణిస్తారు. ప్రజల మనసులో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు.
ఉత్పత్తిని పెంచడం ద్వారా
ఆక్సిజన్ అవసరాలను గుర్తించి వాటి ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇతర స్టేట్లకు పంపాలని భావించారు. దీంతో ఒడిశాలోని జాజ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్, అనుగుల్ లోని జిందాల్, భూషణ్, ఇడ్కో వంటి సంస్థల్లో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడి నుంచి తెలంగాణ, ఏపీ, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లకు పంపించాలని భావించారు. నవీన్ పట్నాయక్ ఉదార స్వభావానికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రజల కోసం బతికే వారు కొందరుంటే ప్రజలను పీడించే వారు కొందరుంటారు. పట్నాయక్ మొదటి కోవకు చెందిన వ్యక్తి. అందుకే ఆయన ప్రజల మనసులోనే చిరస్థాయిగా నిలిచిపోతారు.