https://oktelugu.com/

సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ.. బయేడేటా ఇదీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ మేరకు రమణ చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో పూర్తయ్యింది. ఆయన స్థానంలో జస్టిస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 24, 2021 / 11:44 AM IST
    Follow us on

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ మేరకు రమణ చేత ప్రమాణం చేయించారు.

    రాష్ట్రపతి భవన్ లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

    సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో పూర్తయ్యింది. ఆయన స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టుకు 48వ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

    జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24,2021 నుంచి 2022 ఆగస్టు 26వరకు సుప్రీం చీఫ్ జస్టిస్ గా కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ కావడం విశేషం.

    *ఎన్వీ రమణ బయోడేటా
    జస్టిస్ ఎన్వీ రమణ పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా పొన్నవరం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో.. తల్లిదండ్రులు ఎన్.గణపతిరావు-సరోజినిలు. 1957 ఆగస్టు 27న ఆయన జన్మించారు. కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అమరావతిలోని ఆర్.వి.వి.ఎన్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ చేశారు. 1982లో నాగార్జున యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై, న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

    *న్యాయవాదిగా ప్రస్థానం..
    2000 జూన్ 27న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా, ఉమ్మడి ఏపీకి అదనపు అడ్వకేట్ జనరల్ గా బాధ్యతలు నిర్వహించారు. సివిల్, క్రిమినల్ చట్టాలతోపాటు రాజ్యాంగపరమైన అంశాల్లో జస్టిస్ ఎన్వీ రమణ దిట్టగా పేరుంది.

    *ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ముద్ర
    ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువతి హత్యను సుమోటాగా స్వీకరించి విచారించి సంచలనం సృష్టించారు. అదనపు కోర్టుల ద్వారా నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టారు. న్యాయవ్యవస్థలో అత్యాధునిక సాంకేతిపరిజ్ఞానం ఉపయోగించి ఢిల్లీ హైకోర్టులో ఈ-ఫైలింగ్ ను ప్రారంభించారు.

    ఇప్పుడు సుప్రీంకోర్టులో సీనియర్ గా.. న్యాయకోవిదుడిగా మారి అత్యున్నత పీఠాన్ని మన తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ అధిరోహించాడు.