అన్నట్టు గత సీజన్ లకు భిన్నంగా ఈ సారి సీజన్ 5 కోసం షోలో ఉత్కంఠత పెంచేందుకు నిర్వాహకులు భారీగా స్కెచ్ లను వేస్తున్నారు. అందులో భాగంగా రెండు మూడు ప్రేమ జంటలను తీసుకోబోతున్నారు. అలాగే ముఖ్యంగా బిగ్ బాస్ విజేత ఎవరన్న సస్పెన్స్ ను ఈ సారి లాస్ట్ ఎపిసోడ్ వరకూ కంటిన్యూ అయ్యేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. మెయిన్ గా కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ జర్నీని కూడా ఈ సారి కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. ఒక్క ఎఫైర్స్ నే నమ్ముకోకుండా న్యాచురల్ ఫన్ కూడా జనరేట్ అయ్యేలా గేమ్స్ ను డిజైన్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ షో పై ఎన్నో విమర్శలు వచ్చినా సీజన్స్ గడిచేకొద్దీ అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. రేటింగ్ లో సైతం బిగ్ బాస్ దూసుకుపోతుండటం విశేషం. అందుకే ఈ సారి పాల్గొనే కంటెస్టెంట్స్ లో ప్రముఖ వ్యక్తులను తీసుకోవాలని.. అవసరమైతే వారికీ భారీ మొత్తంలో నజరానా ఇవ్వడానికి కూడా బిగ్ బాస్ టీమ్ సిద్ధంగా ఉందట. మొత్తానికి తెలుగులోనూ బిగ్‌బాస్ తన హవాను పెంచుకుంటూ పోతున్నాడు. అయినా 20 మందిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ ఇంటిలో ఉంచి గేమ్స్ ఆడిపిస్తూ వారి ఎమోషన్స్ తో ఆడుకుంటూ జనాన్ని ఎంటర్ టైన్ చేయడం, జనం కూడా ఇలాంటి వైలెంట్ ఎంజాయి మెంట్ ను కోరుకోవడం నిజంగా విచిత్రమే.