కరోనా ఎపెక్ట్: జనాభా లెక్కలు వాయిదా

దేశంలో కరోనా ఎపెక్ట్ తో జనాభా లెక్కలు, ఎన్పీఆర్ లను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21రోజులపాటు దేశంలో లాక్డౌన్ చేపడుతున్న ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1నుంచి చేపట్టాలని జనాభా లెక్కలను వాయిదా వేశారు. అలాగే ఎన్పీఆర్ ప్రక్రియను కూడా వాయిదా వేసినట్లు కేంద్ర హోంమంత్రిశాఖ వెల్లడించింది. ఎన్పీఆర్ పై ఆయా రాష్ట్రాలు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జనాభా లెక్కలతోపాటు […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 7:13 pm
Follow us on

దేశంలో కరోనా ఎపెక్ట్ తో జనాభా లెక్కలు, ఎన్పీఆర్ లను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21రోజులపాటు దేశంలో లాక్డౌన్ చేపడుతున్న ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1నుంచి చేపట్టాలని జనాభా లెక్కలను వాయిదా వేశారు. అలాగే ఎన్పీఆర్ ప్రక్రియను కూడా వాయిదా వేసినట్లు కేంద్ర హోంమంత్రిశాఖ వెల్లడించింది.

ఎన్పీఆర్ పై ఆయా రాష్ట్రాలు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జనాభా లెక్కలతోపాటు ఎన్పీఆర్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దేశంలో ఎన్పీఆర్ అమలు చేసేందుకు సిద్ధమవడంతో పలు రాష్ట్రాల్లో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్ర హోంశాఖ జనాభా లెక్కలతోపాటు ఎన్పీఆర్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నిరవధిక వాయిదా కొనసాగుతుందని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 562కు చేరింది. వీరిలో 41మంది పూర్తిగా రికవరీ కాగా 9మంది మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలోని రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే 21రోజులపాటు దేశమంతటా లక్డౌన్ చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా నివారణ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకెళ్లాలని సూచిస్తుంది. కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, స్వీయనియంత్రణ పాటించాలని సూచిస్తుంది.