https://oktelugu.com/

అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్

దర్శక దిగ్గజ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రిలీజ్ అయింది. ఈ మోషన్ పోస్టర్లోనే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ గా ప్రకటించారు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తున్న సంగతి తెల్సిందే. బుధవారం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]

Written By: , Updated On : March 25, 2020 / 07:10 PM IST
Follow us on

దర్శక దిగ్గజ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రిలీజ్ అయింది. ఈ మోషన్ పోస్టర్లోనే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ గా ప్రకటించారు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తున్న సంగతి తెల్సిందే. బుధవారం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉగాది రోజున సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్లో ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ పై స్పందించారు. ‘మోషన్ పోస్టర్ కనువిందుగా ఉందని.. ఒళ్లు గ‌గుర్పొచేలా ఉందని’ పేరొన్నారు. దర్శకుడు రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, తార‌క్ ప‌నితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. చిరంజీవి ట్వీట్ కు రాజమౌళి స్పందిస్తూ ‘సర్.. మీరు ప్రశంసించడం ఆనందంగా ఉందని.. ఉగాది శుభాకాంక్ష‌లు..అంటూ ట్విట్ట‌ర్‌కు స్వాగ‌తం’ అంటూ రిప్లయ్ ఇచ్చారు.

ఈ మూవీలో రామ్‌చరణ్‌కు సరసన బాలీవుడ్ భామ ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.