నిత్యవసరాలకు ఇంటికొక్కరు బయటకు వెళ్లేందుకు అనుమతి

కరోనా వైరస్ పై బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో సమావేశం నిర్వహించారు. వీడియో సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 వరకూ పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లు,ఎస్పీలను ఆమె ఆదేశించారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 7:31 pm
Follow us on

కరోనా వైరస్ పై బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో సమావేశం నిర్వహించారు.

వీడియో సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 వరకూ పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లు,ఎస్పీలను ఆమె ఆదేశించారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఉదయం 6గం.ల నుండి మధ్యాహ్నం 1గం.వరకూ ఇంటికి ఒకరు వంతున బయిటకు వచ్చి వారుండే ప్రాంతాలకు 2కిలోమీటర్ల లోపున ఉన్న రైతు బజారులు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు వద్ద ఆయా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చుని చెప్పారు. మధ్యాహ్నం 1గంట తర్వాత మెడికల్ షాపుల్లో మందులు కోనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నవారు తప్పు మిగతా ఎవ్వరూ ఇళ్ళ నుండి బయిటకు రావద్దని సిఎస్ సూచించారు.

అదేవిధంగా ప్రజలు కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో మనిషికి మనిషికి మధ్య కనీసం మూడు అడుగుల సామాజిక దూరాన్ని విధిగా పాటించాలని చెప్పారు.రైతు బజారులు,ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు వద్ద ప్రజలు గుంపులుగా గుంపులుగా చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు,ఎస్పిలను సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.లాక్ డౌన్ కాలంలో ప్రజలు అందరికీ కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు పూర్తిగా అందాలని అందుకుగాను ఇంకా అవసరమైన చోట్ల రైతు బజారులు, అవసరమైన చోట్ల మొబైల్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు. కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు సరఫరాకు సంబంధించిన సప్లయ్ చైన్ ను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.నిత్యావసర వస్తువులు , కూరగాయల ధరలను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అమ్మేలా సంబంధిత ధరల పట్టికలను షాప్ ల ముందు డిస్ప్లే చేయాలని సీ ఎస్ సూచించారు. కలక్టర్,ఎస్పి,డిపిఓ, మున్సిపల్ కమిషనర్,వాణిజ్య పన్నులు, కార్మిక,రవాణా శాఖ లో అధికారులు సమన్వయంతో పనిచేసి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు జరిగేలా చూడడంతోపాటు కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు సక్రమంగా అందేలా చూడాలన్నారు. వివిధ అత్యవసర విధులు నిర్వహించే సిబ్బంది వారు విధులకు హాజరు అయ్యేందుకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు.

విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ త్వరితగతిన గుర్తించి వారిని హో మంచి ఐషోలేషన్ అవసరమైన చోట్ల క్వారంటైన్ కేంద్రాలలో ఉంచాలని అన్నారు.ఇందుకు గాను ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎస్సై లో సహకారంతో సర్వే లెన్స్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టి పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లు ఎస్పీలకు స్పష్టం చేశారు.లాక్ డౌన్ కాలంలో ప్రజలకు పాలు కూరగాయలు పండ్లు ఇతర నిత్యావసర వస్తువులు సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రవాణా, రోడ్లు భవనాలు శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు నేతృత్వంలో 1902 నంబరుతో కూడిన రాష్ట్ర స్థాయి కంట్రోల్ కేంద్రాన్ని విజయవాడలో రోడ్లు భవనాలు శాఖ ఇఎన్సి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్ చెప్పారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ కంట్రోల్ కేంద్రానికి ఎవరైనా ఫోన్ చేసి చెప్పవచ్చని సిఎస్ తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే 85 శాతం పూర్తి చేశారని ఇంకా మిగిలిన వారిని కూడా త్వరగా గుర్తించాలని చెప్పారు.ఈవిధంగా గుర్తించిన వారి వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్ రూపోందించామని దానిలో ఆవివరాలు అప్ లోడ్ చేయాలని అన్నారు.కరోనా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో నాలుగు ఆసుపత్రులు అనగా విశాఖపట్నంలోని నిమ్స్, విజయవాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, తిరుపతిలోని రుయా, నెల్లూరు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రులను కోవిదులు ఆసుపత్రులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. అవసరమైతే జిల్లాల్లో ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఆసుపత్రులను కూడా ఇందుకై తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఈవీడియో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ లాక్ డౌన్ కాలంలో ప్రజలకు ఎక్కడా నిత్యావసర వస్తువులు కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలని ఎస్పిలను ఆదేశించారు.అలాగే పండ్లు కూరగాయలు, పాలు,గుడ్లు ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేసే లారీలు, మినీ లారీలు,గూడ్సు వాహనాలు,ఆటో వ్యాన్ తదితర వాహనాలకు ఆటంకం లేకుండా తిరిగేలా చూడాలన్నారు.ప్రతిరోజు ఈ.6గం.ల నుండి మధ్యాహ్నం 1గం.వరకూ ఇంటికొకరు బయటకు వచ్చి వాటిని కోనుగోలు చేసుకోవాలని సూచించారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ లను డిజిపి ఆదేశించారు. అదేవిధంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ త్వరితగతిన గుర్తించి కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు.ఈవిషయాన్ని ఎస్పిలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని డిజిపి గౌతం సవాంగ్ ఎస్పిలను ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఆశాఖ కమీషనర్ గిరిజా శంకర్,మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు,ఆశాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్, పౌరసరఫరాల శాఖ కమీషనర్ కె.శశిధర్, కార్తికేయ మిశ్రా, విజయరామరాజు, ప్రద్యుమ్న, మధుసూధన్ రెడ్డి, ప్రసన్న వెంకటేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.