Homeఆంధ్రప్రదేశ్‌Postal GDS Recruitment : పోస్టల్‌ శాఖలో 21,413 ఉద్యోగాలు అర్హత కేవలం పదో తరగతే.....

Postal GDS Recruitment : పోస్టల్‌ శాఖలో 21,413 ఉద్యోగాలు అర్హత కేవలం పదో తరగతే.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..

Postal GDS Recruitment :  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల(Central Government Jobs కోసం ఎదురు చూస్తున్న వారికి పోస్టల్‌ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారీగా గ్రామీణ డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 21,413 ఉద్యోగాలు ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలను కూడా నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో 1,215, తెలంగాణ(Telangana)లో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం పదో తరగతి అర్హత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌(Computer Knoledge) ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల మెరిట్‌ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు సైకిల్‌ లేదా బైక్‌ నడపడం వచ్చి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్నవారు మార్చి 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైనవారిని గ్రామీణ డాక్‌ సేవక్‌ కింద బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్, డాక్‌ సేవకులుగా నియమిస్తారు.

దరఖాస్తు ఫీజు..

– జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్‌ ఉమెన్‌ అభ్యర్థులకు పీజు లేదు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ ఫిబ్రవరి 10, 2025, ఆఖరు తేదీ మార్చి 3, 2025.

వయో పరిమితి
అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు 40 ఏళ్లు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హతలు..
ఇక పోస్టల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి పాస్‌ అయి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

వేతనం
బీపీఎం పోస్టులకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు ఉంటుంది. ఏబీపీఎం/డాక్‌ సేవక్‌ వేతనం రూ.10 వేల నుంచి రూ.24,479 వరకు ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు..
ఇక అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్‌(Registreshion)చేసుకోవాలి. ఈ సమయంలో ఫోన్‌ నంబర్, యాక్టివ్‌ ఈమెయిల్‌ ఐడీ ఉండాలి. ఒక అభ్యర్థికి ఒకే రిజిస్ట్రేషన్‌ ఉండాలి. దరఖాస్తుతో ఎలాంటి పత్రాలు జత చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సంతకం, ఇటీవల దిగిన పాస్‌పోర్టు సైజు ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. జీడీఎస్‌(GDS)పోస్టులు కేంద్ర ప్రభుత్వం/పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్‌ ఉద్యోగులు కాదు. వీరి వేతనాలు, అలవెన్సులు, ఇతర అర్హతలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండవని దరఖాస్తుదారులు అర్థం చేసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular