Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్ళడమంటే మామూలు విషయం కాదు. ఆయన చేసినటువంటి సినిమాలు ఇండస్ట్రీలో ఏ హీరో చేయలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ ఆయన చేసిన ప్రతి పాత్రకు న్యాయం చేయగలిగిన నటుడు కూడా చిరంజీవి గారే కావడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వస్తున్న సినిమాలు కొంతవరకు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నప్పటికి ఇక రాబోయే సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి ఎలాగైనా సరే ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట భారీ సక్సెస్ ని సాధిస్తాడా తద్వారా ఎనలేని గుర్తింపును పొందడమే కాకుండా ఆయన లాగా నటించే నటుడు కూడా మరెవరు లేరని మరొకసారి ప్రూవ్ చేసుకోగలుగుతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా చిరంజీవి(Chiranjeevi) చాలా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నాడు. ఇక అందులో భాగంగానే బ్రహ్మానందం (Bramhanandam) అతని కొడుకు రాజా గౌతమ్ (Raja Goutham) నటించిన ‘బ్రహ్మా aa’ (Bramha ananadam)అనే సినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ మన అనుకున్న వాళ్ళ కోసం నేను ఎక్కడ దాకైనా వస్తాను అని చెబుతూనే ఈమధ్య నేను తరచుగా రాజకీయ నాయకుడితో కలుస్తున్నానని చిరంజీవి రాజకీయ వ్యవహారాలు కూడా చేస్తున్నాడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడా అంటు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి.
నాకు ఏ రకమైన రాజకీయ పరమైన ఆశాలు లేవు నాకు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు. ఈ చిరంజీవి జీవితం కళామాతల్లికే అంకితం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. నిజానికి ఈ మధ్య చిరంజీవి కొంతమంది పొలిటీషియన్స్ తో కలుస్తుండటం వల్ల సోషల్ మీడియాలో కొంతమంది చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడు.
తనకు కీలకమైన పదవి కోసమే తరచుగా రాజకీయ నాయకులతో మీట్ అవుతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. కానీ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలను రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రమే వాళ్లతో కలుస్తున్నానని చెప్పడం విశేషం…