Noida Viral Video: ఈ కాలపు యువత కు పట్టపగ్గాలు ఉండడం లేదు. చదువు పేరుతో, ఉద్యోగాల పేరుతో కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. నగరాలలో చదువుకుంటున్నారు. సహజంగానే ఇలాంటి పరిస్థితుల్లో వారికి విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా తీసుకునే నిర్ణయం ఉంటుంది. పైగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు కాబట్టి వారు ఏం చేసినా చెల్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే యువత వేగంగా తమ సహజ ధోరణికి భిన్నంగా వెళుతున్నారు. త్వరగా ఆకర్షణకు గురై ప్రేమలో పడుతున్నారు. ఎదుటివారి మైకంలో ఉండిపోతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కన్నవాళ్ళ ఆశలను చిదిమి వేస్తూ.. తమదైన లోకంలో విహరిస్తున్నారు. పెళ్లయిన తర్వాత భాగస్వామితో చేయాల్సిన పనులను పెళ్లికాకముందే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత చేపట్టాల్సిన వ్యవహారాలను.. యుక్త వయసులోనే చేసేస్తున్నారు. ఆ తర్వాత భేదాభిప్రాయాలు ఏర్పడి విడిపోతున్నారు.
దేశ రాజధానికి సమీపంలో ఉన్న నోయిడాలో నడిరోడ్డు మీద సభ్య సమాజం తల దించుకునే సంఘటన జరిగింది. ఓ జంట అందరూ చూస్తుండగానే రెచ్చిపోయింది. ఒక యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.. ఓ అమ్మాయి ట్యాంకర్ ముందు కూర్చుని.. అతడిని గట్టిగా హత్తుకుంది. రెండు కాళ్ళను వెనుకవైపు అలా పెట్టి రెచ్చిపోయింది. అతడు బైక్ డ్రైవ్ చేస్తుంటే.. ఆ యువతి మాత్రం ముద్దులతో రెచ్చిపోయింది.. చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు.. ఇలా చేస్తే తప్పు అనే భావన ఆమెలో ఏ మాత్రం కనిపించలేదు. పైగా నాలుగు గోడల మధ్య ఉన్నట్టుగా ప్రవర్తించింది.. అతడు కూడా దానికి అడ్డు చెప్పకుండా.. ఆస్వాదించడం మొదలుపెట్టాడు. తమను ఎవరూ గమనించడం లేదని ఆ జంట భావించారు. వారి పనిలో వారు నిమగ్నమయ్యారు. కానీ ఓ వ్యక్తి ఆ వ్యవహార మొత్తాన్ని వీడియో తీశాడు.. ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
బండి నెంబర్ ఆధారంగా
ఆ బండి నెంబర్ ఆధారంగా ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేశాడు. దీంతో ఆ బండి నెంబర్ ఆధారంగా పోలీసులు స్పందించారు. పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు ఆ బైక్ నమోదైన వ్యక్తి పేరు మీద వివిధ కేసులు నమోదు చేశారు.. ఒకటి కాదు రెండు కాదు 53,500 రూపాయల అపరాధ రుసుము విధించారు. అంతేకాదు ఇంకొకసారి ఇలాంటి పనులకు పాల్పడితే తిక్క కుదుర్చుతామని హెచ్చరించారు. పోలీసులు చేసిన ఈ పనికి ఒక్కసారిగా ఆ జంట షాక్ అయింది. తమ పనిలో తమ నిమగ్నమై ఉంటే.. ఈ పని చేసింది ఎవరు అంటూ ఆశ్చర్యపోయింది. నేటి కాలంలో ఎవరూ చూడడం లేదు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లకు కెమెరాలు ఉన్నాయి. రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే చాలు పరువు గంగలో కలిసిపోతుంది. ఇదిగో ఇలా అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. అందుకే యువతా తస్మాత్ జాగ్రత్త!
View this post on Instagram