Homeఎంటర్టైన్మెంట్Telugu Directors Technology Usage: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టెక్నాలజీ లేనప్పుడు క్వాలిటీ మూవీస్...

Telugu Directors Technology Usage: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టెక్నాలజీ లేనప్పుడు క్వాలిటీ మూవీస్ వచ్చాయి… ఇప్పుడెందుకు రావడం లేదు…

Telugu Directors Technology Usage: తెలుగు లో ఉన్న దర్శకులు ప్రస్తుతం వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. మన మేకర్స్ పాన్ ఇండియాలో సత్తా చాటడానికి పలు వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేసి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను సైతం వాళ్ల వైపు తిప్పుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడే చాలామంది దర్శకులు విజువల్ వండర్స్ ని క్రియేట్ చేశారు. మాయాబజార్ లాంటి ఒక క్లాసికల్ సినిమా […]

Telugu Directors Technology Usage: తెలుగు లో ఉన్న దర్శకులు ప్రస్తుతం వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. మన మేకర్స్ పాన్ ఇండియాలో సత్తా చాటడానికి పలు వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేసి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను సైతం వాళ్ల వైపు తిప్పుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడే చాలామంది దర్శకులు విజువల్ వండర్స్ ని క్రియేట్ చేశారు. మాయాబజార్ లాంటి ఒక క్లాసికల్ సినిమా ను తీశారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల బడ్జెట్ వందల వేల కోట్లు దాటుతున్నప్పటికి టెక్నాలజీ విషయంలో మనవాళ్లు చాలా వరకు విజువల్ గా అంత పెద్ద వండర్స్ క్రియేట్ చేయడం లేదు. మరి బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్ది సినిమా క్వాలిటీ పెరగాలి కానీ క్వాలిటీ తగ్గుతుంది.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

దానికి కారణం రెమ్యూనరేషన్స్ విషయంలోనే చాలా వరకు డబ్బు మొత్తం హీరోలు, దర్శకులకే వెళ్ళిపోతుందని తద్వారా సినిమా మీద పెట్టడానికి డబ్బు సరిపోడం లేదని ఉన్న దాంట్లోనే సినిమాలను చుట్టేస్తున్నారు అంటూ కొంతమంది వాపోతున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం టెక్నాలజీని వాడుకునే స్థాయిలో మన దర్శకులు లేరని వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక వాళ్ళు రాసే కథలకు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకునే అవసరం లేదని కూడా కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తొందరలోనే సినిమా క్వాలిటిని పెంచుతూ గొప్ప సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే తప్పకుండా ఆ సినిమాలను ఆదరిస్తారు.

తద్వారా సినిమాలు సూపర్ సక్సెస్ సాధించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు… ప్రస్తుతం మన మేకర్స్ ఇండియా పరిధిని దాటి వరల్డ్ లెవెల్ కి ప్రవేశిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో బడ్జెట్ ను సినిమా మీద కేటాయించి సినిమాకి బెస్ట్ ఔట్ పుట్ ను తీసుకొచ్చి టెక్నికల్ గా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper