https://oktelugu.com/

శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకునే వారికి షాక్

శుభకార్యాలు, పెళ్లిళ్లు చేయాలని చూస్తున్న వారికి షాక్.. తెలుగు రాష్ట్రాల్లో ఇక బాజాలు మూగబోనున్నాయి. వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ యజమానులు, పూజారులు, మ్యూజిక్ బ్యాండ్లు, డీజేలు, క్యాటరర్లు మరియు నిర్వాహకులు దాదాపు నాలుగు నెలల పాటు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 126 రోజుల పాటు శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకోవడానికి లేదు. ఈసారి చాలా గ్యాప్ వచ్చేసింది. దాదాపు నాలుగు నెలలకు పైగా మూఢాలు రావడంతో ముహూర్తాలు లేకుండా పోయాయి. పండితులు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2021 / 10:25 AM IST
    Follow us on

    శుభకార్యాలు, పెళ్లిళ్లు చేయాలని చూస్తున్న వారికి షాక్.. తెలుగు రాష్ట్రాల్లో ఇక బాజాలు మూగబోనున్నాయి. వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ యజమానులు, పూజారులు, మ్యూజిక్ బ్యాండ్లు, డీజేలు, క్యాటరర్లు మరియు నిర్వాహకులు దాదాపు నాలుగు నెలల పాటు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి.

    ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 126 రోజుల పాటు శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకోవడానికి లేదు. ఈసారి చాలా గ్యాప్ వచ్చేసింది. దాదాపు నాలుగు నెలలకు పైగా మూఢాలు రావడంతో ముహూర్తాలు లేకుండా పోయాయి.

    పండితులు తాజాగా బాంబు పేల్చారు. మే 14 వరకు శుభ ముహూర్తులు లేవని స్పష్టం చేశారు. దీనిబట్టి 126 రోజులపాటు శుభముహూర్తాలకు అంతరం ఏర్పడింది. మే నెల వరకు వివాహాలు, గ్రుహ ప్రవేశం.. ఇతర శుభ కార్యక్రమాలు ఉండవు. మళ్లీ శుభకార్యాలకు మే 14 నుండి జూలై 11 వరకు మాత్రమే నిర్వహించవచ్చు. ఆ తరువాత, ఆగస్టు 8 వరకు మళ్లీ మూఢాలతో మంచి ముహూర్తాలు లేవు.

    దీనికారణంగా రాష్ట్రంలో ఫంక్షన్ హాళ్ళకు వ్యాపారం ఉండదు. అదేవిధంగా, పూజారులు కూడా ఈ కాలంలో ఇతర ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి… మ్యూజిక్ బ్యాండ్ ప్లేయర్స్ ,, శుభలేఖలు కొట్టేవారు.. ఈవెంట్ మేనేజర్లు, డీజేలు, ఫుడ్ క్యాటరింగ్ సేవలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మరియు ఇతరులు వంటి అనుబంధ వృత్తులకు కూడా ఈ కాలంలో ఆదాయం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    కరోనా లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత బహిరంగ సభలపై ప్రభుత్వ ఆంక్షల కారణంగా 2020 లో ఈ రంగాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక ఈ సంవత్సరం మూఢాల కారణంగా మంచి ముహూర్తాలు లేక 2021 లో కూడా ఈ రంగాలు కుదేలు అవుతున్నాయి.