నష్ట పోయిన ధనం తిరిగి రావాలంటే శివుడికి ఈ నీటితో అభిషేకం చేయాల్సిందే..!

సాధారణంగా శివుడు అంటే అభిషేక ప్రియుడు అని భావిస్తారు. ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది సోమవారం రోజున భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. వివిధ రకాలపదార్థాలతో ఆ శివునికి అభిషేకం చేయించడం ద్వారా శివుని కృపకు పాత్రులు కాగలరని పండితులు చెబుతుంటారు. అయితే శివుడికి సోమవారం ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం… Also Read: ఏపీలోని ఆ జిల్లాలో వింత ఘటన.. ముల్లంగిలో దర్శనమిచ్చిన […]

Written By: Kusuma Aggunna, Updated On : January 12, 2021 2:46 pm
Follow us on

సాధారణంగా శివుడు అంటే అభిషేక ప్రియుడు అని భావిస్తారు. ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది సోమవారం రోజున భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. వివిధ రకాలపదార్థాలతో ఆ శివునికి అభిషేకం చేయించడం ద్వారా శివుని కృపకు పాత్రులు కాగలరని పండితులు చెబుతుంటారు. అయితే శివుడికి సోమవారం ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

Also Read: ఏపీలోని ఆ జిల్లాలో వింత ఘటన.. ముల్లంగిలో దర్శనమిచ్చిన గణపతి ఆకారం..!

శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం ఆవుపాలతో అభిషేకం నిర్వహించడం ద్వారా సర్వ సౌఖ్యములు కలుగుతాయి.అదేవిధంగా పసుపు నీటితో శివునికి అభిషేకము నిర్వహించడం ద్వారా ఎంతో శుభప్రదం, మంగళకరం అని చెప్పవచ్చు. ఆ విధంగా పసుపు నీటితో అభిషేకం చేయించటం వల్ల ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.మామిడి పండ్ల రసంతో శివునికి అభిషేకం నిర్వహించడం వల్ల దీర్ఘకాలికంగా వెంటాడుతున్న సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం నిర్వహించడం వల్ల అకాల మృత్యువు తొలగిపోతుంది.

Also Read: శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకునే వారికి షాక్

ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలు ఉన్న నీటితో అభిషేకం చేయటం వల్ల భోగభాగ్యాలు లభిస్తాయి. అదేవిధంగా గరిక నీటితో అభిషేకం చేయడం వల్ల మనం నష్టపోయిన ధనాన్ని తిరిగి పొందవచ్చు. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వివిధ రకాల పుష్పాలు చేత అభిషేకం చేయడం వల్ల భూ లాభం పొందవచ్చు. కొబ్బరి నీటితో అభిషేకము నిర్వహించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.విభూదితో ఆ పరమ శివునికి అభిషేకం చేయడం వల్ల మనం చేసినటువంటి సర్వ పాపాలు సైతం తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం