కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అది. రాష్ట్రంలోనూ నేతల గణం బాగానే ఉంది. ఇంకేముంది ఊపేయవచ్చు అనుకుంటున్నారా? కానీ ఆ పార్టీకి ఓట్లు మాత్రం లేవు. ఆ పార్టీ బీజేపీ కాగా.. ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ లో అస్సలు వాటా లేని పార్టీ బీజేపీ.. ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలవలేని పార్టీ అది. మొన్నటి 2019 ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలువలేకపోవచ్చు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశవ్యాప్తంగా సభ్యత్వం పెరుగుతోంది. కానీ ఏపీలో మాత్రం తగ్గుతోంది. ఇవన్నీ పార్టీని ఏమాత్రం కలవరపెట్టకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
Also Read: సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ..!
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చాలా గ్రూపులుగా విడిపోయింది. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తొలగించాలని పార్టీలోని ఒక బలమైన విభాగం కోరుకుంటోంది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం తొలగించడం లేదు. ఒక ఎమ్మెల్సీ నేతృత్వంలోని బలమైన గ్రూపు కన్నా స్థానాన్ని భర్తీ చేయాలని ఆరాటపడుతోంది. ఇక టీడీపీ మద్దతుతో గెలిచిన మరో ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందాలని కోరుకుంటున్నాడు.
ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు, నాయకులు తమ ప్రస్తుత పార్టీ కంటే మాజీ పార్టీ ప్రయోజనాలను పరిరక్షించడానికే కృషి చేస్తున్నారు. వారు ఇప్పటికీ మాజీ పార్టీ అధినేత వంత పాడుతున్నారు.
Also Read: జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!
ఇలా ఏపీ బీజేపీలో మూడు నాలుగు గ్రూపులు చురుకుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయకుండా.. ఓట్లు సంపాదించే మార్గం వెతక్కుండా కొట్లాడుకుంటూ జాతీయ పార్టీని ఏపీలో ఎక్కడా కనిపించకుండా చేస్తున్నారనే ఆవేదన సగటు బీజేపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ గ్రూపుల కొట్లాటకు చెక్ చెప్పి నడిపించే నాథుడు కావాలని వారంతా కోరుతున్నారు.