బాపురే.. రోడ్డుపై కరోనా పేషంట్ల ధర్నా..!

కరోనా పేరు చెబితే జనం వణికిపోతున్నారు. ఎవరి నుంచి కరోనా ఎలా వస్తుందోననే భయాందోళనతో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో కరోనా షేషంట్లు మూకుమ్మడి రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే ఇంకేమైనా ఉందా? అక్కడి ప్రజల పరిస్థితి ఊహించుకోవడమే కష్టంగా మారింది. అయితే ఇలాంటి సంఘటన మనపక్కనే ఉన్న తమిళనాడులో రాష్ట్రంలో చోటుచేసుకుంది.   దేశంలోనే తమిళనాడు కరోనా కేసులు విషయంలో రెండో ప్లేసులో కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా […]

Written By: Neelambaram, Updated On : July 24, 2020 10:03 pm
Follow us on

కరోనా పేరు చెబితే జనం వణికిపోతున్నారు. ఎవరి నుంచి కరోనా ఎలా వస్తుందోననే భయాందోళనతో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో కరోనా షేషంట్లు మూకుమ్మడి రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే ఇంకేమైనా ఉందా? అక్కడి ప్రజల పరిస్థితి ఊహించుకోవడమే కష్టంగా మారింది. అయితే ఇలాంటి సంఘటన మనపక్కనే ఉన్న తమిళనాడులో రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 

దేశంలోనే తమిళనాడు కరోనా కేసులు విషయంలో రెండో ప్లేసులో కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కట్టడి కావడం లేదు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే చైన్నెలో కరోనా పేషంట్లు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం సంచలనం మారింది. కరోనా షేషంట్లు రోడ్లపైకి రావడంతో స్థానికులంతా భయాందోళకుగురై పరుగులు తీశారు.

Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

చెన్నెలోని మంకాడు ముత్తుకుమారన్ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన వెలుగుచూసింది. ఐసోలేషన్లో ఉంటున్న తమకు సరైన చికిత్స అందించడం లేదంటూ కరోనా పేషంట్లు రోడ్లపైకి వచ్చారు. తాగునీరు, ఆహారం సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆరోపిస్తూ కరోనా బాధితులంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. దీంతో చుట్టుపక్కల జనం భయాందోళనతో పరుగులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడి చేరుకున్నారు. కరోనా బాధితులకు సర్దిచెప్పి ఆందోళన విరమించేలా చేశారు. దీంతో కరోనా బాధితులు తిరిగి క్వారంటైన్లోకి వెళ్లడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: మాస్కు పెట్టుకోలేదా.. లక్ష కట్టాల్సిందే..!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 12లక్షల87వేల945కు నమోదుకాగా ఇందులో 8లక్షల17వేల208మంది కోలుకున్నారు. 30,601మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక తమిళనాడులో ఇప్పటివరకు 1,92,964 పాజిటివ్ కేసులు నమోదుకాగా 3,232మంది మృతిచెందారు. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.