Chandrababu Jail: చంద్రబాబును పట్టించుకునేవారేరి.. ఎవరికీ కాకుండా పోయారా?

పవర్ లేని పొలిటిషియన్ అందరికీ అలుసేనన్నట్టు చంద్రబాబు పరిస్థితి మారింది. జాతీయ రాజకీయాల గురించి కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా చంద్రబాబు లేరు. ప్రస్తుతం ఏ కూటమిలో కూడా టిడిపి భాగస్వామ్యం కాలేదు. త

Written By: Dharma, Updated On : September 11, 2023 2:12 pm

Chandrababu Jail

Follow us on

Chandrababu Jail: ఇండియన్ మోస్ట్ సీనియర్ లీడర్.. చంద్రబాబు. దేశ రాజకీయాల్లోనే సుపరిచితుడు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు పాత్ర కీలకం. అది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అయితే అటువంటి నాయకుడు ప్రస్తుతం గుడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లాడు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నా.. జాతీయస్థాయిలో ఆ స్థాయిలో స్పందన లేకపోవడం విచారకరం.

పవర్ లేని పొలిటిషియన్ అందరికీ అలుసేనన్నట్టు చంద్రబాబు పరిస్థితి మారింది. జాతీయ రాజకీయాల గురించి కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా చంద్రబాబు లేరు. ప్రస్తుతం ఏ కూటమిలో కూడా టిడిపి భాగస్వామ్యం కాలేదు. తన సీనియారిటీని, సిన్సియారిటీని గౌరవించే భాగస్వామి పక్షాలు ఉన్నా ఇండియా కూటమి వైపు వెళ్లలేని స్థితి చంద్రబాబుది. అలాగని ఎన్డీఏ వైపు చూస్తుంటే బిజెపి అగ్రనేతలు పట్టించుకోని దుస్థితి. ఈ తరుణంలో తనకు కేసుల రూపంలో.. కష్టకాలం దాపురించినా జాతీయస్థాయిలో పలకరించేవారు కరువయ్యారు. ఇది ఒక విధంగా చంద్రబాబుకు లోటే.

ఒకప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో గోద్రా అల్లర్లు జరిగాయి. నాడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు ఒకానొక దశలో.. నరేంద్ర మోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి దించాలని బిజెపి హై కమాండ్కు ఆదేశాలు ఇచ్చారు. కానీ నాడు ఎల్కే అద్వానీ చొరవతో వివాదం సద్దుమణిగింది. అంతటి శక్తివంతమైన చంద్రబాబు.. ఇప్పుడు ఈ చిన్న కేసులో జైలు పాలు కావడం.. కనీసం జాతీయస్థాయిలో స్పందించే నేతలు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం బిజెపి నాయకులు సైతం ఏపీలో ఏం జరుగుతుందో ఆరా తీయకపోవడం ఆశ్చర్యం వేస్తోంది.

గతంలో జాతీయస్థాయిలో జరిగే ఎటువంటి పరిణామాల నైనా చంద్రబాబు ఎదుర్కునేవారు. ఒక విధంగా చెప్పాలంటే ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నా పట్టించుకునే వారే లేకపోయారు. గత ఎన్నికల్లో బిజెపిని విభేదించి కాంగ్రెస్ వైపు చంద్రబాబు వెళ్లారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ అది జరగకపోగా.. ఏపీలో అధికారానికి దూరమయ్యారు. బిజెపి భయంతో రాహుల్ గాంధీ స్నేహాన్ని సైతం వదులుకున్నారు. ఇప్పుడు తాను ఆశిస్తున్న బిజెపి సహకారం లేదు.. అటు ఇండియా కూటమిలో ఉన్న తన పాత స్నేహితులు సైతం తన వైపు చూడని దుస్థితి. మొత్తానికి అయితే చంద్రబాబు స్వరాష్ట్రంలో పాటు జాతీయ స్థాయిలో సైతం నిస్సహాయ స్థితిలో ఉండడం విశేషం.