https://oktelugu.com/

హోం ఐసోలేషన్ బాధితుల గోడు పట్టదా?

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తొలినాళ్లలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. అయితే కరోనా ఎప్పుడైతే విజృంభించడంతో మొదలైందో ప్రభుత్వం కూడా చేతులేత్తిసినట్లు కన్పిస్తోంది. కరోనాతో సహజీవనం అనే స్లోగన్ బయటికి తీసి మీ చావు మీరు చావండి అన్నట్లు ప్రభుత్వతీరు ఉండటం శోచనీయంగా మారింది. Also Read: ఆస్పత్రుల్లో కరోనా దందా.. చోద్యం చూస్తున్న నేతలు? తెలంగాణలో ఆన్ లాక్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 6, 2020 / 12:57 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తొలినాళ్లలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. అయితే కరోనా ఎప్పుడైతే విజృంభించడంతో మొదలైందో ప్రభుత్వం కూడా చేతులేత్తిసినట్లు కన్పిస్తోంది. కరోనాతో సహజీవనం అనే స్లోగన్ బయటికి తీసి మీ చావు మీరు చావండి అన్నట్లు ప్రభుత్వతీరు ఉండటం శోచనీయంగా మారింది.

    Also Read: ఆస్పత్రుల్లో కరోనా దందా.. చోద్యం చూస్తున్న నేతలు?

    తెలంగాణలో ఆన్ లాక్ 1.0కు ముందు కరోనా మహ్మమరి కేవలం జీహెచ్ఎంసీకే పరిమితమైంది. ఆన్ లాక్ అమలు చేసే విషయం ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నగరాల నుంచి పల్లెలకు కరోనా పాకుతున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం మొద్దునిద్ర పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

    ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆచరణలో చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేకుండా పోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా హోం ఐసోలేషన్ బాధితులను గోడును ప్రభుత్వం గాలికొదిలేసిందనే టాక్ విన్పిస్తుంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 25శాతం బాధితుల్లో మాత్రమే లక్షణాలు కన్పిస్తుండగా మిగిలిన 75శాతం మందిలో స్పల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా ఉన్నవారిని మాత్రమే ప్రభుత్వం ఆస్పత్రుల్లో చేర్పిస్తుండగా మిగిలిన వారంతా హోం ఐసోలేషన్లో చికిత్స చేయించుకోవాలని సూచిస్తుంది.

    Also Read: కేసీఆర్, మోడీలకు ఒకేరోజు అసదుద్దీన్ షాక్

    హోం ఐసోలేషన్లో ఉన్నవారికి కరోనా కిట్స్ పేరిట ప్రభుత్వం మాస్కులు, శానిటైజర్లు, మందులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే కరోనా కిట్స్ కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం అవుతున్నాయి. జిల్లాల్లో కరోనా కిట్స్ అందకపోవడంతో కరోనా రోగుల కుటుంబ సభ్యులు, బంధువులు బెంబేలేత్తిపోతున్నారు. బాధితులకు కేవలం వైద్య సిబ్బంది మందులు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికైనా ఐసోలేషన్ బాధితుల గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు.