https://oktelugu.com/

ఇండస్ట్రీలో ఉప్మా యవ్వారాల పై కరోనా చెక్ !

కరోనా సినీ పరిశ్రమలను నాశనం చేసిందని విన్నాం. సినీ కార్మికులకు అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోయిందని విన్నాం. రోజూ కరోనా చేసిన చేస్తున్న మానసిక ఆరోగ్య ధ్వంసాలను వింటూనే ఉన్నాం. కానీ, కరోనా మేలు కూడా చేసింది. ఎంత చెడులోనైనా ఒకానొక సందర్భంలో మంచి కూడా జరుగుతుందనే నానుడి ప్రకారం కరోనా.. సినీ పరిశ్రమకి మేలు చేసింది. సినిమా అనే రాజ్యంలో తమకంటూ సొంతగా సామ్రాజ్యాలను సృష్టించుకుని కొత్త రక్తాన్ని అణిచి వేస్తోన్న ఎందరో రాజులను కరోనా […]

Written By:
  • admin
  • , Updated On : August 6, 2020 / 12:24 PM IST
    Follow us on


    కరోనా సినీ పరిశ్రమలను నాశనం చేసిందని విన్నాం. సినీ కార్మికులకు అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోయిందని విన్నాం. రోజూ కరోనా చేసిన చేస్తున్న మానసిక ఆరోగ్య ధ్వంసాలను వింటూనే ఉన్నాం. కానీ, కరోనా మేలు కూడా చేసింది. ఎంత చెడులోనైనా ఒకానొక సందర్భంలో మంచి కూడా జరుగుతుందనే నానుడి ప్రకారం కరోనా.. సినీ పరిశ్రమకి మేలు చేసింది. సినిమా అనే రాజ్యంలో తమకంటూ సొంతగా సామ్రాజ్యాలను సృష్టించుకుని కొత్త రక్తాన్ని అణిచి వేస్తోన్న ఎందరో రాజులను కరోనా కుదిపేస్తోంది. వాళ్ళ రాజ్యాలను కూల్చేస్తోంది. సినిమా రంగం పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదురుకున్న దాఖలాలు లేకపోవడం.. అన్నిటికి మించి డిజిటల్ విప్లవం రావడం.. సినిమాని ఇలాగే చేయాలి.. సినిమాని ఇలాగే రిలీజ్ చేయాలి.. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే నీకు మా దయ ఉండాలి లాంటి చచ్చుబారిన మాటలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడటం లేదు.

    Also Read: బిగ్ బాస్ హౌస్ లో.. మసాలా లవ్ డ్రామాలు!

    ఏంటి నువ్వు రైటరా.. ఒక్క సినిమాకి కూడా పని చేయకుండానే డైరెక్టర్ అయిపోతావా.. అసలు మ్యూజిక్ అంటే ఏంటో నీకు తెలుసా.. సినిమాల్లో ఎదగాలంటే, ఎదిగిన వాళ్ళ కింద కొన్ని ఏళ్ళు పడి ఉండాలి.. వారికి నీకు వచ్చిన విద్యని, నీ టాలెంట్ ని గోస్ట్ అనే పదం తగిలించుకుని ధారాదత్తం చేయాలి.. లాంటి ఉప్మా యవ్వారాలను కరోనా నిర్దాక్షిణ్యంగా కాటేసింది. విషయం ఉన్నోడే.. స్క్రిప్ట్ రాసుకోవడం వచ్చినోడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా చేయగలడు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇప్పుడు వస్తోన్న సినిమాలు బయట నుండి వచ్చిన కొత్త కుర్రాళ్లు తీస్తున్నవే. మొదటిసారి ఇలాంటి ఈజీ అవకాశాలు ఇండస్ట్రీలో వచ్చాయి. కరోనా మరో ఏడాది ఇలాగే ఉంటే..ఇండస్ట్రీ పూర్తిగా మారిపోవడం ఖాయం.

    Also Read: కీర్తి సురేశ్‌ పెళ్లి.. మళ్లీ లొల్లి

    పాపం ఇండస్ట్రీని చాలా ఏళ్ల నుండి ఏలుతున్న వాళ్లకు ఈ పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో.. ఈ కష్ట కాలాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధం కాక అందరిలానే ఏం చేయలేక.. ఇండస్ట్రీలో తమకున్న పట్టును వదిలేస్తున్నట్లు కనిపిస్తుంది. తమ కింద ఉన్న థియేటర్ల వ్యవస్థను వదిలేస్తున్నారు. ఎవరికి వారు కొంత టాలెంట్ కోసం అన్వేషిస్తున్నారు. అయితే సినిమాని నమ్ముకుని బతుకుతున్న కార్మిక బతుకులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. కరోనా వారిని అయోమయంలో పడేసింది. ఇప్పుడు కష్టాలు పడినా.. మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశతో సినీ కార్మికులు కాలాన్ని కష్టంగా నెట్టుకొస్తున్నారు. అయితే డిజిటల్ లో సినిమా నిర్మాణం పెరిగితే.. వారికి గతంలో దొరికిన స్థాయిలో కరోనా అనంతరం పని దొరకక పోవొచ్చు. కాబట్టి వారు ఇప్పటి నుండే మరో ఆదాయ మార్గాన్ని వెతుక్కోవడం ఉత్తమం అనిపించుకుంటుంది.