https://oktelugu.com/

కేసీఆర్.. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడా?

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే అసలైన రాజకీయ నాయకుడు అని అంటారు. ఆ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు ఆకులు ఎక్కువే చదివాడని అంటుంటారు. కేసీఆర్ వేసే ప్రతీ అడుగులోనూ రాజకీయం ఉంటుందని చెబుతుంటారు. Also Read: హోం ఐసోలేషన్ బాధితుల గోడు పట్టదా? ప్రస్తుతం కేసీఆర్ తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణలో కరోనాను కంట్రోల్ చేయలేదన్న పెద్ద అపవాదు ఆయనపై ఉంది. మొదట్లో హడావుడి చేసి కరోనా కేసులు పెరుగుతున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2020 / 01:11 PM IST
    Follow us on


    ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే అసలైన రాజకీయ నాయకుడు అని అంటారు. ఆ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు ఆకులు ఎక్కువే చదివాడని అంటుంటారు. కేసీఆర్ వేసే ప్రతీ అడుగులోనూ రాజకీయం ఉంటుందని చెబుతుంటారు.

    Also Read: హోం ఐసోలేషన్ బాధితుల గోడు పట్టదా?

    ప్రస్తుతం కేసీఆర్ తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణలో కరోనాను కంట్రోల్ చేయలేదన్న పెద్ద అపవాదు ఆయనపై ఉంది. మొదట్లో హడావుడి చేసి కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వ వైద్యాన్నీ గాలికి వదిలేశాడన్న విమర్శలున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నా.. హైకోర్టు చీవాట్లు పెడుతున్నా స్పందించక విమర్శలపాలయ్యాడు.

    అయితే ఎప్పుడు విమర్శలు ఎదురైనా.. తెలంగాణ ప్రజలు ఎంత తిట్టినా.. ఒకే ఒక చర్యతో వారిని మెస్మరైజ్ చేయగల సామర్థ్యం కేసీఆర్ సొంతం. ఇప్పుడూ అదే చేశాడు.

    ప్రస్తుతం వానాకాలం.. నీటి అవసరం పొలాలకు బాగా అవసరం. అందుకే కాళేశ్వరం నుంచి తెలంగాణ ప్రాజెక్టులు నింపే పనిని తాజాగా కేసీఆర్ మొదలుపెట్టారు. కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు మీదుగా కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్లు ప్రవహించేలా మోటార్లన్నీ ఆన్ చేస్తున్నారు.

    Also Read: కేసీఆర్, మోడీలకు ఒకేరోజు అసదుద్దీన్ షాక్

    దీంతో కరోనా వైఫల్యాలన్నీ మరుగునపడి కేసీఆర్ పై రైతాంగం.. ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తుతోంది. బీడువడిన పొలాలకు, కాలువలకు నీళ్లు పారిస్తూ కేసీఆర్ చేస్తున్న భగీరథ యాత్నానికి ఆయన వైఫల్యాలన్నీ కొట్టుకుపోతున్నాయి.

    తెలంగాణలోని ప్రాజెక్టులను నీటి కుండలా సిద్ధం చేస్తున్న వైనం నీటి కోసం తండ్లాడిన తెలంగాణ బిడ్డలకు కడుపు నింపుతోంది. కేసీఆర్ తప్పుల్ని లైట్ తీసుకుందామని ప్రజల్లో భావన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలకు ఏమిస్తే.. తనను నెత్తిన పెట్టుకుంటారో తెలిసిన కేసీఆర్ నేర్పరితనాన్నే మరోసారి రిపీట్ చేశారు. అదే ఆయనకు శ్రీరామరక్షగా చెప్పక తప్పదు. ఇలా ఎంతటి గడ్డు పరిస్థితులైనా కేసీఆర్ చాకచక్యంగా పరిష్కరిస్తూ ముందుకు వెళుతుంటారు. మళ్లీ అదే మాజిక్ రిపీట్ చేశారు.

    -ఎన్నం