Nitin Nabin: ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ఇక దేశంలో ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ఖూడా బీజేపీ. ఈ పార్టీ అధ్యక్షుడు అంటే సాదాసీదాగా ఉండకూడదు. ఇంత పెద్ద పార్టీని నడిపే సామర్థ్యం ఉన్న నాయకుడు కూడా ఖావాలి. ఇందుకోసం బీజేపీ జేపీ.నడ్డా వారసుడి ఎంపిక కోసం పెద్ద కసరత్తే చేసింది. చివరకు 40 ఏళ్ల యువ రాజకీయ నాయకుడు బిహార్‌కు ఛెందిన నితిన్ నబీన్‌ను ఎంపిక చేసింది. ముందుగా ఫార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఆశ్చర్యం ఏమిటంటే నితిన్ నబీన్ పేరును తల పండిన రాజకీయ విశ్లేషకులు, పత్రికా ఎడిటర్లు కూడా ఊహించలేదు. ఈ ఎంపిక వెనుక లోతైన వ్యూహాత్మక ప్రణాళిక దాగి ఉంది.
బిహార్ నుంచి జాతీయ రాజకీయాల్లోకి..
బిహార్‌లో గడిపిన బాల్యం, పార్టీ కార్యకర్తగా ప్రారంభించిన నితిన్ నబీన్ క్రమంగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో జాతీయ బాధ్యతలు చేపట్టడం అసాధారణం. స్థానిక సమస్యల్లో చురుకుగా పాల్గొని, యువతను ఆకర్షించే మాట్లాడు శైలి కలిగి ఉన్నాడు. పార్టీ వర్కింగ్గా ప్రకటనకు మూడు నాలుగు గంటల ముందే అతనికీ ఈ విషయం తెలిసింది. వెంటనే సిద్ధమై ప్రజల ముందుకు వచ్చాడు. రాజకీయ ప్రత్యర్థిని స్పష్టంగా గుర్తించి చెప్పిన ధైర్యం, సమస్యలకు సొల్యూషన్లు సూచించిన తెలివి పార్టీ బాధ్యతాదారులను ఆకర్షించాయి. ఇది అతని నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
ఏడాది లోతైన పరిశోధన..
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ నాయకత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. ఏడాదిన్నర పాటు రహస్య అధ్యయనం చేపట్టింది. అనుభవంతోపాటు, రాజకీయ విశ్లేషకుల టీమ్‌ను ఏర్పాటు చేసి, 50 ఏళ్లలోపు యువ కార్యకర్తలను గుర్తించారు. మొదట 100 మంది జాబితా సిద్ధం చేసి, వారి గత కార్యకలాపాలు, ట్రాక్ రికార్డును ఆరు నెలలు విశ్లేషించారు. ఆ తర్వాత 50 మందికి తగ్గించి, వారికి రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులు, కార్యక్రమాలు అప్పగించారు. పనితీరు, నిర్ణయాధికారం, ఫలితాలను నిశితంగా పరిశీలించి 10 మందికి సంకుచించారు. ఈ ప్రక్రియలో పార్టీ ఆచరణాత్మక పరీక్షలు, ఫీడ్‌బ్యాక్ సెషన్లు నిర్వహించారు.
ప్రత్యేక పరీక్షల్లో నంబర్ వన్
10 మందిని పార్టీ నిర్ణయాలు, రాష్ట్ర రాజకీయాలు, సవాళ్ల పరిష్కారాలపై లోతైన ప్రశ్నలు వేసి పరీక్షించారు. నాయకత్వ శైలి, కొత్త ఆలోచనలు, దీర్ఘకాల విధానాలు అంశాలను విశ్లేషించారు. నితిన్ నబీన్ ఈ దశలో అగ్రస్థానంలో నిలిచి, పార్టీ భవిష్యత్ దిశలు, వయసు పరిధి, కట్టుబాటు కార్యనిర్వహణలపై స్పష్టమైన దృక్పథం చూపాడు. అతను రాజకీయ ప్రత్యర్థిని గుర్తించి చెప్పడం, సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు సూచించడం పార్టీకి నమ్మకం కల్పించింది. ఇది పార్టీ వ్యూహాత్మక దృష్టి, యువత అవసరాన్ని సూచిస్తుంది.
99 మంది భవిష్యత్ లీడర్లు..
అధ్యక్షుడు ఒక్కడే కాకుండా, మిగతా 99 మందికి కీలక బాధ్యతలు అప్పగించే ప్రణాళిక ఉంది. రాష్ట్రాల్లో కార్యనిర్వాహక పదవులు, కార్యక్రమాల నిర్వహణ ద్వారా వారిని ఏర్పరచుతారు. ఇది పార్టీని ఆధునికీకరించి, కొత్త తరం నాయకులతో ముందుకు తీసుకెళ్తుంది. ఈ వ్యూహం పార్టీని దీర్ఘకాలంలో బలోపేతం చేస్తుంది. యువతకు అవకాశాలు తెరవడం ద్వారా కొత్త శక్తి ప్రవేశం జరుగుతోంది.
మొత్తంగా ఈ ఎంపిక పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశిస్తోంది. వయసు, ఆలోచనా విధానం, కొత్త ఆలోచనల అవసరాన్ని పరిగణించి తీసుకున్న నిర్ణయం. నితిన్ నబీన్ ప్రయాణం పార్టీకి కొత్త శకాన్ని తీసుకువస్తుందని అంచనా.