NH 163 Banyan Trees: వినాశనం లేకుండా వికాసం సాధ్యం కాదు అంటారు. ఇప్పటివరకు జరిగిన వికాసం మొత్తం వినాశనం తర్వాతే చోటుచేసుకుంది. ఇప్పటికైతే ప్రకృతి తన వినాశనాన్ని తట్టుకుంది కానీ.. ఇకపై తట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రకృతిలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటుంది. కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఎండల గురించి, శీతల గాలుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దాని పర్యవసనాలు మనిషి జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. వినాశనం లేకుండా వికాసం వైపు అడుగులు వేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అయితే దీనిని సాధ్యం చేసి చూపించారు. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను ఆనుకుని బీజాపూర్ రహదారి నిర్మిస్తున్నారు. 2018లో ఈ రోడ్డు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే ఎన్ని రోజులపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ కేసు పెండింగ్లో ఉంది. దీంతో ఇన్ని సంవత్సరాలపాటు ఈ రోడ్డు నిర్మాణం ఆగిపోయింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పరిష్కారం కావడంతో రోడ్డు నిర్మాణ పనులకు మోక్షం లభించింది. 18 నెలల కాలంలోనే ఈ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొయినాబాద్, చేవెళ్ల మీదుగా మన్నెగూడ వరకు బీజాపూర్ రోడ్డు విస్తరణ చేస్తున్నారు. దాదాపు 46 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని 60 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలలో నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఏకంగా 956 కోట్ల నిధులను మంజూరు చేసింది. బైపాస్ రోడ్డు ను చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాలలో నిర్మిస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం బైపాస్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 50 శాతం పనులను పూర్తి చేశారు. గత నెల 3న చేవెళ్ల మండలంలో మీర్జాగూడ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు ఈ రోడ్డు నిర్మాణంలో 15 అండర్ పాస్ లను నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రాన్ని కలుపుతూ ఉంటుంది. వాహన రద్దీకి అనుగుణంగా ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇది గతంలో అంతరాష్ట్ర రహదారిగా ఉంది. 2018లో కేంద్రం దీన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. దీనికి ఎన్ హెచ్ 163 అని పేరు పెట్టింది. ఈ రోడ్డుకు ఇరువైపులా మర్రి చెట్లు ఉన్నాయి. రోడ్డు నిర్మాణంలో మర్రి చెట్లను తొలగించకూడదని ఓ సంస్థ చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. దీంతో పనులు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే మర్రి చెట్లను తొలగించకుండా అలైన్మెంట్లో మార్పులు చేశారు. దీంతో మరి చెట్లు అలాగే ఉన్నాయి. రోడ్డు నిర్మాణంలో ఆ లైన్ మెంట్ మార్పు వల్ల చెట్లు బతికి బట్ట కట్టాయి.