Homeజాతీయ వార్తలుNita Ambani : మనుమడి పాఠశాలకు వెళ్లిన ఆసియా కుబేరుడి భార్య.. పిల్లలతో కలిపి నీతా...

Nita Ambani : మనుమడి పాఠశాలకు వెళ్లిన ఆసియా కుబేరుడి భార్య.. పిల్లలతో కలిపి నీతా అంబానీ చేసిన పని వైరల్

Nita Ambani :  ఆసియా అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ. తండ్రి  ధీరూభాయ్‌ అంబాని వారసత్వాన్ని అందిపుచుకుని భారత దేశంలో బిజినెస్‌ కింగ్‌గా ఎదిగాడు. అన్నిరంగాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీని విస్తరించాడు. ఇక ఇంటర్నెట్‌ రంగంలో అయితే సంచలనం సృష్టించాడు. అంబానీకి ముంబైలో భారీ భవనం ఉంది. ఇప్పటికే అంబానీకి ఐదు ప్రైవేటు జెట్‌లు ఉన్నాయి. ఇటీవలే మరో జెట్‌ కొనుగోలు చేశాడు. ఇక అంబానీకి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. వారు కూడా వ్యాపారంలో ఉన్నారు. ఇటీవలే చిన్న కుమరుడు అనంత్‌ అంబానీ వివాహం ప్రపంచంలో కనీవిని ఎరుగని రీతిలో రాధిక మర్చంట్‌తో జరిపించారు. ఇక అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా వ్యాపారరంగంలోనేఉన్నారు. అనేక సేవా కార్యక్రమాల నిర్వహిస్తున్నారు. మనుమలు, మనుమరాళ్లతో అంబానీలు హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే అంబానీ మనుమడు పృథ్వీ అంబానీని పాఠశాలలో చేర్పించారు. మనుమడు ఎలా చదువుతున్నాడో తెలుసుకునేందుకు నీతా అంబానీ, మనుమడి పాఠశాలకు వెళ్లారు.

విద్యార్థులతో ముచ్చట..
నీతా అంబానీ పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో కాసేపు కూర్చున్నారు. పిల్లలతో ముచ్చటించారు. తన మనుమడితోపాటు సహచర విద్యార్థులతో పాఠాలు చదివించారు. ఈమేరు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో అంబానీ మనుమడితోపాటు కరీనా కపూర్‌ కుమారుడు జహంగీర్‌ జే అలీఖాన్‌ కూడా ఉన్నాడు. వీడియోలో నీతా అంబానీ కుర్చీపై కూర్చొని ‘పెప్పా పిగ్‌‘ పుస్తకాన్ని చదువుతున్నట్లు ఒక ఫోటో చూపించింది, వారు నేలపై కూర్చుని నవ్వుతూ కనిపించారు. ఇక పిల్లలు కూడా నీతా అంబానీని చుట్టుముట్టారు. బొమ్మలు అందజేశారు. వారు తయారు చేసిన ఆర్ట్, క్రాఫ్ట్‌ను నీతా అబానీ వీక్షించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు.

రాణి పింక్‌ కుర్తాలో..
నీతా అంబానీ తన క్లాసీ, సొగసైన డ్రెస్సింగ్‌ సెన్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె ఇటీవలి పాఠశాల సందర్శన కూడా భిన్నంగా లేదు. ఆమె అద్భుతమైన రాణి పింక్‌ కుర్తాలో గ్లామర్‌ మరియు గ్రేస్‌ రెండింటినీ వెదజల్లుతూ మరో చిక్‌ ఫ్యాషన్‌ ప్రకటన చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version