https://oktelugu.com/

I Movie: తప్పు ఎక్కడ జరిగింది…ఐ మూవీ ప్లాప్ కి ఈ కారణం ఏంటో చెప్పిన శంకర్..!

I Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అనేది చాలామందికి ఉపాధిని ఇస్తుంది. ముఖ్యంగా ఒక సినిమా స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరూ ఆ సినిమా మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల రోజువారి కార్మికులకు చాలావరకు ఉపాధి దొరుకుతుందనే చెప్పాలి... ఇక దాని కోసమే చాలామంది పెద్ద దర్శకులు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు...

Written By:
  • Neelambaram
  • , Updated On : October 7, 2024 / 11:53 AM IST
    Follow us on

    I Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్… ఆయన చేసిన సినిమాలు ఒకప్పుడు పెను సంచలనాలను సృష్టించాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘భారతీయుడు 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు. ఇక ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలు నుంచి శంకర్ చేస్తున్న ఏ సినిమా కూడా సక్సెస్ ని సాధించలేకపోవడం విశేషం. ఒకప్పుడు శంకర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరు ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురు చూస్తూ ఉండేవారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఎంత మంచి మార్కెట్ అయితే ఉందో తెలుగులో కూడా అంతకు మించిన మార్కెట్ అయితే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన భారీ అంచనాలతో చేసిన ఐ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    ముఖ్యంగా ఐ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఏర్పడ్డాయి. ముఖ్యంగా ‘నువ్వుంటే నా జతగా’ అనే సాంగ్ లో వచ్చే ఆ జంతువు గెటప్ ట్రైలర్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ గెటప్ కు సంబంధించిన సీన్స్ కొన్ని సినిమాల్లో ఉంటాయని ప్రేక్షకుడు భావించాడు. ఇక దానికి అనుగుణంగానే సినిమాలో అలాంటి సీన్స్ అయితే ఏమీ లేవు.

    ఈ సినిమా రిలీజ్ కి ముందు కూడా చాలా హైప్ ని క్రియేట్ చేసుకుంది. దాని వల్ల కూడా సినిమాకి భారీగా మైనస్ అయితే జరిగిందని, ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా తను చాలా వరకు రాంగ్ ప్రాసెస్ ని ఎంచుకున్నానని శంకర్ చెప్పడం విశేషం. మొత్తానికైతే ఐ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుంది. అనుకున్నప్పటికీ అదొక భారీ డిజాస్టర్ గా మిగలడంతో శంకర్ అభిమానులు సైతం చాలా బాధపడ్డారనే చెప్పాలి.

    మరి ఐ మూవీ లో శంకర్ విజువల్స్ పరంగా చాలా ఎక్స్ ట్రా ఆర్డినర్ గా చూపించినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో తేడా కొట్టడం అనేది ఈ సినిమాకి భారీగా మైనస్ అయిందని శంకర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘భారతీయుడు 3’ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…