నిర్మలా టార్గెట్: జగన్‌ చెబితేనే గార్గ్‌ అలా చేశాడా..!

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఒక్కసారిగా కేంద్ర ఆర్థిక మంత్రిపై ఆరోపణలు చేయడం రాజకీయ కలకలం సృష్టించింది. ఈ ఆరోపణలు వెనుక పెద్దలు ఉన్నట్లుగా అనుమానాలు మొదలయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సుభాష్‌ చంద్ర గార్గ్‌ తీరుపై రాజకీయంగా దుమారం రేపింది. Also Read: దేశప్రజలకు కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీ ఉన్నట్లుండి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆరోపణలు గుప్పించారు. దీంతో […]

Written By: NARESH, Updated On : November 2, 2020 1:29 pm
Follow us on

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఒక్కసారిగా కేంద్ర ఆర్థిక మంత్రిపై ఆరోపణలు చేయడం రాజకీయ కలకలం సృష్టించింది. ఈ ఆరోపణలు వెనుక పెద్దలు ఉన్నట్లుగా అనుమానాలు మొదలయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సుభాష్‌ చంద్ర గార్గ్‌ తీరుపై రాజకీయంగా దుమారం రేపింది.

Also Read: దేశప్రజలకు కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీ

ఉన్నట్లుండి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆయన వెనుక జగన్‌ సర్కారు ఉందని ప్రచారం జరుగుతోంది. పోలవరం, ఇతర నిధులు రాకుండా అడ్డుపడుతున్నందునే ఆమెను టార్గెట్‌ చేసినట్లు సమాచారం. ఎవరైనా తమకు నచ్చిన విధంగా నడుచుకోకపోతే.. వారిపై ఎవరో ఒకరిని ఉసిగొల్పడం ఈ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహమని అంటున్నారు. నిధుల మంజూరులో గతేడాది ఉదార స్వభావంతో మెలిగిన నిర్మలా సీతారామన్‌.. ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడడం లేదని ప్రధాన ఆరోపణ.

పోయిన జనవరిలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి దాదాపు రూ.13,000 కోట్ల వరకు అదనపు రుణ సదుపాయం కల్పించారు. ఈ ఏడాది కొత్త అప్పుల కోసం రాష్ట్రం పంపిన కొన్ని ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించడం లేదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉన్నతాధికారులు నిర్మలా సీతారామన్‌తో భేటీ అయినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో గార్గ్‌ను తెరపైకి తెచ్చి వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నాలకు జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిజానికి కేంద్ర మంత్రి ఈ ఏడాది కూడా రాష్ట్రం ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులిచ్చారు. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కి సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేసి.. రూ.5,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునేందుకు అంగీకరించింది. నిబంధనలకు లోబడే కాకుండా చట్ట వ్యతిరేకంగా కూడా రాష్ట్రం నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు పలు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇవేవీ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనల దశలోనే వాటిని తుంచేసింది.

Also Read: మూడు రాజధానులపై హైకోర్టులో కీలక విచారణ

ఇప్పుడు తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రం కేంద్రం కొర్రీలు పెడుతోంది. అంచనా వ్యయాన్ని రూ.20,398 కోట్లకే పరిమితం చేయాలనుకుంటోంది. ఇది జగన్‌ సర్కారుకు మింగుడుపడడం లేదు. ఇదే జరిగితే రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతోంది. కేంద్రాన్ని, మంత్రులను బతిమాలుకోవడం మాని.. టార్గెట్‌ చేయడం మొదలుపెట్టింది. అయితే ప్రభుత్వ పెద్దలు ఇందులో నేరుగా ఎంటర్‌‌ కాకుండా.. గార్గ్‌ వంటి రిటైర్డ్‌ ఆఫీసర్లతో ఆరోపణలు చేయిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ఆర్థిక శాఖ నుంచి గార్గ్‌ను ఆకస్మికంగా విద్యుత్‌ శాఖకు బదిలీ చేయడంతో జూలైలో స్వచ్ఛందంగా పదవీవిరమణకు దరఖాస్తు చేశాడు. గతేడాది అక్టోబరు 31వ తేదీన ఆయన్ను రిలీవ్‌ చేశారు. తర్వాత జగన్‌ ప్రభుత్వం ఆయన్ను ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది. అయితే.. ఆ సమయంలో ఎలాంటి ఆరోపణలకు దిగని ఆయన.. ఇప్పుడు పెద్ద స్థాయి వారిని టార్గెట్‌ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్