Union Budget: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే క్రమంలో ఆర్థిక మంత్రి ఆ పత్రాలను చాలా జాగ్రత్తగా, రహస్యంగా తీసుకు రావడం ఆనవాయితీ. అయితే గతంలో మన దేశంలో ఈ పత్రాలను సూట్ కేస్‌లో తీసుకొచ్చేవారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 2019లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఎర్రటి ఎర్రని పోర్ట్‌ఫోలియో పట్టుకుని పార్లమెంట్‌కు వచ్చారు. అది చూసిన వారంతా ఆశ్చర్య పోయారు. అందులో ఆమె బడ్జెట్ పత్రాలను తీసుకు వచ్చారు.
అయతే ఇలా ఎర్రని వస్త్రంలో ఆమె బడ్జెట్ పత్రాలను మన భారతీయ సంస్కృతిలో చుట్టిన పత్రాలను పార్లమెంట్ లో తీసి చదవి వినిపించారు. దీంతో అప్పటి నుంచి ఇదే ఎర్రని వస్త్రంలో ఆమె బడ్జెట్ పత్రాలను ప్రతిసారి తీసుకు వస్తున్నారు. అయితే ఇలా ఎర్రని వస్త్రాన్ని తీసుకు రావడం వెనక అసలు కారణం ఏంటని చాలామందికి అనుమానం ఉంది. కాగా దీని మీద ప్రధాన ఆర్ధిక సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం క్లారిటీ ఇచ్చారు.
Also Read: నన్ను వ్యభిచారానికి కూడా పనికి రావన్నాడు.. లజెండరీ డ్యాన్స్ మాస్టర్‌పై సుధ సంచలన వ్యాఖ్యలు
మన బడ్జెట్ విషయంలో కూడా మన భారతీయ సంస్కృతిని పాటించడం ముఖ్యమని నిర్మలా సీతారామన్ ఇలా చేశారని చెప్పుకొచ్చారు. సూట్ కేస్‌లలో తేవడం పాశ్చాత్య సంస్కృతి అని, అందుకే దానికి ఆమె స్వస్తి పలికినట్టు వివరించారు. ఇక ఈ పత్రాలను బడ్జెట్ అనే కంటూ కూడా మన దేశంలో అయితే ఖాతావహి అంటారని ఆయన వివరించారు.
బ్రిటీష్ వారి సంస్కృతి అయిన సూట్‌కేస్ లలో బడ్జెట్ పత్రాలను తేవడం మానేయాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ వివరించారు. బ్రిటీష్ వారు మన దేశాన్ని పాలించినప్పుడు ఇలా సూట్‌కేస్ లలో బడ్జెట్‌ను తీసుకొచ్చే వారని, కాబట్టి ఆ విధానాన్ని మానేసి మన భారతీయ సంస్కృతిని పాటించే విధంగా ఇలా ఎర్రని వస్త్రంలో తీసుకు వస్తున్నట్టు ఆమె తెలిపారు.
Also Read: ఇంటర్ అర్హతతో రూ. లక్షకుపైగా వేతనంతో జాబ్స్.. ఎలా పొందాలంటే?