Modi-KCR: మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టినప్పటి నుంచి బీజేపీ మీద కేసీఆర్ అసహనంగా ఉన్నారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రాన్ని గట్టిగానే నిలదీశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తోందంటూ మండిపడ్డారు. వాస్తవానికి వడ్ల రాజకీయం తెర మీదకు వచ్చినప్పటి నుంచే స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగి మరీ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. అంతకు ముందు ఉన్న సన్నిహిత్యం కాస్తా ఈ దెబ్బకు దూరం అయిపోయింది.
కాగా ఈ వివాదం ప్రధాని రాకను తిరస్కరించేంత వరకు వెళ్లింది. ఇప్పుడు తెలంగాణలో చినజీయర్ స్వామి నిర్వహిస్తున్న సమతామూర్తి వేడుకకు హాజరయ్యేందుకు ప్రధాని తెలంగాణకు వస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన రాకకు కేసీఆర్ స్వయంగా వెళ్లి స్వాగతం పలుకుతారని నిన్న రాత్రి నుంచి ప్రచారం జరిగింది. కాగా నిన్న రాత్రే సీఎం ప్లేస్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లేందుకు సీఎంవో ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
Also Read: PM Modi: నేడు మోడీ రాక.. సమతమూర్తి రామనుజ విగ్రహావిష్కరణ.. ఇక్రిసాట్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
వీటిని నిన్న రాత్రి బహిర్గతం చేయకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో అందరూ కేసీఆరే వెళ్తారని అనుకున్నారు. కానీ తెల్లారే సరికి సీన్ మారిపోయింది. కేసీఆర్‌కు జ్వరంగా ఉందని, అందుకే తలసానిని పంపుతున్నట్టు ఇందులో పేర్కొన్నారు. కానీ ఇక్కడ అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది.గత కొంత కాలంగా మోడీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న కేసీఆర్‌ను మోడీ కావాలనే వద్దన్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ స్వాగతం మోడీకి ఇష్టం లేదని సమాచారం. స్వాగతం పలికే సమయంలో కేసీఆర్ ఇబ్బంది పడినా.. లేదంటే ఏ కొంచెం నిరసన వ్యక్తం చేసినట్టు ప్రవర్తించినా.. బాగోదని మోడీ గ్రహించారంట. అందుకే ఆయన్ను ఇక్రిశాట్ మీటింగ్‌కు కూడా రావొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా కేంద్రంతో చేస్తున్న రాజకీయంలో కేసీఆర్‌కే పూర్తి స్పష్టత రావట్లేదని, అంతా గందరగోళం నెలకొందంటూ టీఆర్ ఎస్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: Modi vs KCR : ప్రధాని మోడీతో కేసీఆర్ కు సంధి లేదు.. సమరమే.. రుజువు ఇదిగో!