https://oktelugu.com/

‘ఆకాశం నీ హద్దురా’ టీం మోహన్ బాబును సరిగ్గా వాడుకోలేదా?

తమిళ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళీ నటించగా కలెక్షన్ మోహన్ బాబు అతిథి పాత్రలో నటించాడు. చాలారోజుల గ్యాప్ తర్వాత మోహన్ బాబు ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ కోసం ముఖానికి మేకప్ వేసుకున్నారు. అయితే దర్శకురాలు సుధ కొంగర ఆయనను సరిగ్గా వాడుకోలేదనే టాక్ విన్పిస్తోంది. Also Read: సోనియా అగర్వాల్ ‘సినీ’ కష్టాలు.. గుండె తరుక్కుపోవాల్సిందే..! ఓటీటీలో విడుదలైన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 04:15 PM IST
    Follow us on

    తమిళ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళీ నటించగా కలెక్షన్ మోహన్ బాబు అతిథి పాత్రలో నటించాడు. చాలారోజుల గ్యాప్ తర్వాత మోహన్ బాబు ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ కోసం ముఖానికి మేకప్ వేసుకున్నారు. అయితే దర్శకురాలు సుధ కొంగర ఆయనను సరిగ్గా వాడుకోలేదనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: సోనియా అగర్వాల్ ‘సినీ’ కష్టాలు.. గుండె తరుక్కుపోవాల్సిందే..!

    ఓటీటీలో విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వస్తోంది. సుధ కొంగర ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించారు. టాలీవుడ్లో కలెక్షన్ కింగ్ గా పేరున్న మోహన్ బాబు ఈ మూవీలో నటిస్తుండటంతో ఆయన పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆయనను కేవలం గెస్ట్ రోల్ కే పరిమితం చేయడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.

    ‘ఆకాశం నీ హద్దురా’ మూవీలో మోహన్ బాబు తన రియల్ నేమ్ భక్తవత్సలం క్యారెక్టర్లో నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబును కేవలం రెండు మూడు సీన్లకే పరిమితంచేసి గెస్ట్ క్యారెక్టర్ కే పరిమితం చేసినట్లు కన్పించింది. మోహన్ లాంటి హీరోలకు సరిపడా క్యారెక్టర్ కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం చేశారు.

    Also Read: అక్షయ్ ‘లక్ష్మీ’ డిజాస్టర్ టాక్.. రికార్డు వ్యూస్.. కారణమేంటి?

    చాలా గ్యాప్ తర్వాత మోహన్ బాబు నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాలో ఆయనది పవర్ ఫుల్ క్యారెక్టర్ అయి ఉంటుందని అభిమానులు భావించారు. తీరా సినిమాలో మాత్రం ఆయనను కేవలం గెస్ట్ రోల్ కే పరిమితం చేశారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    దీంతో ఆయన అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. మోహన్ పాత్రను సరిగ్గా డిజైన్ చేయకపోవడంతోనే ఆయన చిత్ర ప్రమోషన్లలో పెద్దగా కన్పించలేదని టాక్ విన్పిస్తోంది. దర్శకురాలు సుధ కొంగర  తెలుగు ప్రేక్షకుల కోసమైన మోహన్ క్యారెక్టర్ ను కొంచెం ఎలివేట్ చేసి చూపిస్తే బాగుండేదని అభిమానులు కామెంట్స్ విన్పిస్తున్నాయి.