ఇక మిగిలింది ఉరే!

నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో మరణశిక్ష విధించబడిన నలుగురు నిందితులలో ఒకరైన ముఖేష్ సింగ్ పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దోషి తరుపు న్యాయవాది ప్రభుత్వ సలహాదారుల వాదనలు విన్న జస్టిస్ బ్రిజేష్ సేథి ఈ ఉత్తర్వును రిజర్వు చేశారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ.. “తాను దేశ రాజధానిలో లేన”ని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్ట్ కొట్టివేసింది. రెండు రోజుల క్రితం అంతర్జాతీయ కోర్ట్ లో కూడా దోషులు వేసుకున్న […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 4:51 pm
Follow us on

నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో మరణశిక్ష విధించబడిన నలుగురు నిందితులలో ఒకరైన ముఖేష్ సింగ్ పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దోషి తరుపు న్యాయవాది ప్రభుత్వ సలహాదారుల వాదనలు విన్న జస్టిస్ బ్రిజేష్ సేథి ఈ ఉత్తర్వును రిజర్వు చేశారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ.. “తాను దేశ రాజధానిలో లేన”ని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్ట్ కొట్టివేసింది.
రెండు రోజుల క్రితం అంతర్జాతీయ కోర్ట్ లో కూడా దోషులు వేసుకున్న పిటిషన్ ని కొట్టి వేయడంతో దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు అయిపోయాయి.

చివరి అవకాశంగా ముఖేష్ అభ్యర్ధనను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో దోషులైన ముఖేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ సింగ్ (31) లకు ఈ నెల (మార్చి) 20 తెల్లవారుజామున 5.30 గంటలకు నిస్సందేహంగా ఉరి పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.