https://oktelugu.com/

సిఎం కుర్చీ ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్

హితులు , రాజకీయ పెద్దలు ఇచ్చిన సలహాతో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. వాటిలో మొదటిగా వచ్చేది “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ 75 శాతం పైగానే పూర్తయ్యిందట.ఇక ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వం లో మరో చిత్రానికి ఒకే చెప్పడం జరిగింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 18, 2020 / 05:28 PM IST
    Follow us on

    హితులు , రాజకీయ పెద్దలు ఇచ్చిన సలహాతో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. వాటిలో మొదటిగా వచ్చేది “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ 75 శాతం పైగానే పూర్తయ్యిందట.ఇక ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వం లో మరో చిత్రానికి ఒకే చెప్పడం జరిగింది. ఖుషి ఫేమ్ ఏ ఎం రత్నం నిర్మాతగా వస్తున్నా క్రిష్ సినిమా ఫినిషింగ్ దశకు చేరుకోగానే గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది.

    మెగా ఫామిలీ హీరోలతో గబ్బర్ సింగ్ ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ,డీజే , గడ్డలకొండ గణేష్ వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించి హిట్ లర్ అనిపించుకొన్న దర్శకుడు హరీశ్ శంకర్.

    ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా కమర్షియల్ ఎంటర్ టైనర్నే తెరకెక్కించాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఈసారి కాస్త సోషల్ మెసేజ్ ని కూడా మిక్స్ చేయాలని అనుకుంటున్నాడట. విశ్వసనీయం గా తెలుస్తున్న దాన్నిబట్టి పవన్ కళ్యాణ్ ని హరీశ్ శంకర్ ముఖ్యమంత్రిగా విభిన్న పాత్రలో చూపించాలని అనుకుంటున్నాడట . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు తెరకెక్కిస్తున్నారు.
    Nothing succeeds like success