https://oktelugu.com/

రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ

  కొరటా దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు […]

Written By: , Updated On : March 18, 2020 / 04:32 PM IST
Follow us on

 

కొరటా దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ఈసినిమాకు ‘ఆచార్య’ టైటిల్ నే అనుకున్నారు. కానీ చిరు చేసిన పొరపాటు వల్ల మళ్ళీ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట. ఇక త్రిష కూడా అవుట్ అవడంతో హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కాజల్ నటించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. మరి టైటిల్ అండ్ హీరోయిన్ విషయంలో క్లారిటీ రావాలంటే కొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.