https://oktelugu.com/

వైసీపీని భయపెడుతున్న నిమ్మగడ్డ..?

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ఏమిటో స్థానిక రాజకీయ పార్టీలకు అస్సలు బోధ పడడం లేదు. ఆయన ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో… అర్థంకాని పరిస్థితి. ఏం చేయాలని తలబద్ధలు కొట్టుకుంటున్నారు. పురపాలక ఎన్నికలను ఆగిన చోటునుంచే మొదలు పెడదామని నిమ్మగడ్డ ప్రకటించడంతో అధికార పార్టీ ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగాయి. Also Read: రేణిగుంట విమానాశ్రయంలో బైటాయించిన చంద్రబాబు.. నేలపై కూర్చొని నిరసన.. తీవ్ర […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 1, 2021 / 11:53 AM IST
    Follow us on


    ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ఏమిటో స్థానిక రాజకీయ పార్టీలకు అస్సలు బోధ పడడం లేదు. ఆయన ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో… అర్థంకాని పరిస్థితి. ఏం చేయాలని తలబద్ధలు కొట్టుకుంటున్నారు. పురపాలక ఎన్నికలను ఆగిన చోటునుంచే మొదలు పెడదామని నిమ్మగడ్డ ప్రకటించడంతో అధికార పార్టీ ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగాయి.

    Also Read: రేణిగుంట విమానాశ్రయంలో బైటాయించిన చంద్రబాబు.. నేలపై కూర్చొని నిరసన.. తీవ్ర ఉద్రిక్తత

    అంతేకాదు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేనతో పాటు మరి కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారించి ఎస్ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. రీ నోటిఫికేషన్ కోరుతూ.. దాఖలైన 16 ఫిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో ఎస్ఈసీతో పాటు అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై రిజియన్ల వారీగా సమీక్ష సమావేశాలను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పెద్ద బాంబునే పేల్చేశారు.

    బలవంతపు చర్యలతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్న.. ప్రత్యేక పరిస్థితుల్లో నామినేషన్లు వేయలేకపోయి వారికి మరో అవకాశం కల్పించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. బాధితుల అభ్యర్థనలపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం.. ఇలాంటి వారిపై సానుభూతితో వ్యవహరించి సంశయ లాభం కింద మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల ప్రకటించారు.

    Also Read: బీజేపీని పక్కనపెట్టిన ప్రధాన మీడియా..?

    ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న విశేషాధికారాలను మొదటిసారి వినియోగించుకోబోతున్నామని ఆయన తేల్చి చెప్పేశారు. అయితే వీటికి సంబంధించి.. కలెక్టర్ల నుంచి పూర్తిస్థాయిలో నివేదికలు రాగానే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవం చేసుకున్న అభ్యర్థులు ఖుషీగా ఉన్నారు. అయితే ఎస్ఈసీ తాజా పిడుగులాంటి ప్రకటనతో అభ్యర్థుల్లో భయం పట్టుకుంది. చాలా చోట్ల అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు ముట్టచెప్పి.. ఏకగ్రీవం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ మరోసారి నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తే.. తమ పరిస్థితి ఏంటని ఏకగ్రీవం అయిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్