ఇప్పుడిక కొడాలి నాని వంతు.. సాయంత్రం 5వరకు డెడ్ లైన్ ఇచ్చిన నిమ్మగడ్డ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ పార్టీ అన్నట్లు మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వైసీపీ ప్రజా ప్రతినిధులు.. అధికారులను ఓ చూపుచూసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. ఆయనకు షోకాజు నోటీసులు జారీ చేసి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ విధించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. వ్యక్తిగతంగా కానీ.. ప్రతినిధి […]

Written By: Srinivas, Updated On : February 12, 2021 1:11 pm
Follow us on


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ పార్టీ అన్నట్లు మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వైసీపీ ప్రజా ప్రతినిధులు.. అధికారులను ఓ చూపుచూసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. ఆయనకు షోకాజు నోటీసులు జారీ చేసి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ విధించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. వ్యక్తిగతంగా కానీ.. ప్రతినిధి ద్వారా కానీ వివరణ ఇవ్వాలని సూచించారు. వివరణ ఇవ్వకుంటే.. చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. మంత్రి ఏ వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: రాజ‌కీయాల్లోకి అన‌సూయ‌.. ఏ పార్టీలో చేర‌బోతోంది?

ఏపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షాక్ ఇచ్చారు. ఆయనకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఎస్ఈసీని కించపరుస్తూ.. వ్యాఖ్యలు చేశారంటూ.. ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగతంగా లేదా.. ప్రతినిధి ద్వారా వివరణ ఇవ్వాలని సూచించారు. వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: నిమ్మగడ్డతో జగన్ సర్కార్ రాజీ?

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు చేస్తున్నారని.. మీడియా సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యలకు తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని.. ఇందుకు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు డెడ్ లైన్ విధిస్తూ.. నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై మంత్రి కొడాలి నాని ఎలా స్పందిస్తారు.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మంత్రి కొడాలి నాని రేషన్ సరుకుల డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి ఎస్ఈసీని టార్గెట్ చేశారు శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషనర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మీడియాలో ప్రసారమైన ఫటేజీలు పరిశీలించిన తరువాత పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై సీఎం జగన్ బొమ్మ, వైఎస్సార్సీపీ జెండా రంగులు ఉండడంతో ఉపయోగించరాదని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై జగన్ సర్కారు కోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ విచారణ కొనసాగుతోంది. ఇంతలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం.. ఎస్ఈసీ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.