దర్శకుడు : బుచ్చిబాబు
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవి శంకర్
సినిమాటోగ్రఫి: షమాదత్ సైనుద్దీన్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్స్: మౌనిక రామకృప్ణ
సమర్పణ: సుకుమార్
రేటింగ్ : 2.75
కథ :
గ్రామ పెద్ద రాయుడు ( విజయ్ సేతుపతి) కుమార్తె బేబమ్మ అలియాస్ సంగీత (కృతి శెట్టి)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్). ఈ మధ్యలో వీరి మధ్య జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. అది తెలుసుకున్న రాయుడు బేబమ్మను కట్టడి చేయడానికి ఏమి చేశాడు ? తన ప్రాణం కన్నా ప్రేమించిన బేబమ్మను ఆశీ ఎందుకు దూరం చేసుకొన్నాడు ? ఆశీ వదిలేసిన తర్వాత బేబమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? ఇంతకీ రాయుడు చేసిన పని ఏమిటి ? అనేది మిగిలిన కథ.
Also Read: ‘ఉప్పెన’ ట్విట్టర్ రివ్యూ.. అంతా సూపర్.. అక్కడే తేడా!
విశ్లేషణ :
రాయుడు పాత్రలో విజయ్ సేతుపతి ఎంట్రీతో సినిమా కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. రాయుడు చేసే కొన్ని పనులు ఆసక్తిని, కథపై క్యూరియాసిటీని కలిగిస్తాయి. ఇక
ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్… ఈ కథ జరిగిన నేపథ్యం, సహజంగా సాగే పాత్రలు, సినిమా చూస్తున్నంత సేపు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలగడం, అలాగే డైరెక్టర్ రాసుకున్న సున్నితమైన భావోద్వేగాలు కొన్ని చోట్ల అబ్బురపరుస్తాయి. అలాగే వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఫర్‌ఫెక్ట్‌గా లాంచ్ అయింది.
Also Read: రాజకీయాల్లోకి అనసూయ.. ఏ పార్టీలో చేరబోతోంది?
అలాగే ఆశీ, బేబమ్మ మధ్య లవ్, రొమాంటిక్ సన్నివేశాలు రొటీన్‌గా సాగినా మంచి ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో కథను మరీ లాగదీసి చెప్పారా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆశీ, బేబమ్మ లేచిపోయిన తర్వాత సీన్లు మరీ కొత్తదనం లేకుండా తెరపైన కనిపిస్తాయి. ఆశీ తండ్రి జాలయ్య (సాయి చంద్)కు సంబంధించిన సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. చివర్లో కృతి శెట్టి, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇక ఈ మధ్య చాలామంది డైరెక్టర్స్ డైలాగ్స్ ను జస్ట్ సీన్ ను కమ్యూనికేట్ చేయటానికే తప్ప, డైలాగ్స్ మీదే డిపెండ్ అవ్వట్లేదు. కానీ, డైలాగ్స్ సినిమాని నిలబెట్టగలవని గతంలో చాలా సినిమాలు రుజువు చేశాయి. ఇప్పుడు ఈ సినిమాతో అది మరొక సారి రుజువు అయింది. డైలాగ్స్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ,
నటీనటుల నటన,
ఎమోషనల్ గా సాగే లవ్ డ్రామా,
డైలాగ్స్,
సంగీతం,
క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్ :
స్లో సాగే ప్లే,
బోరింగ్ డ్రామా,
రొటీన్ సీన్స్,
తీర్పు :
తీర్పు :
ఉప్పెన అంటూ వచ్చిన ఈ సినిమా ఎమోషన్స్ తో తడిపేస్తోంది. రెగ్యులర్ సినిమాల పరంపరలో నలిగిపోతున్న ఆడియన్స్ కి చాల రోజుల తరువాత అర్ధవంతమైన కంటెంట్ తో, విలువైన మెసేజ్ తో పాటు సహజమైన పాత్రలు, ఆ పాత్రాల తాలూకు బలమైన సంఘర్షణలతో మరియు సున్నితమైన భావోద్వేగాలతో సాగే ఈ సినిమా… కచ్చితంగా నచ్చుతుంది. అయితే, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, మోటివ్ సీన్స్ ఇంకా బలంగా ఉండాల్సిందనే ఫీలింగ్ కలగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. అయినప్పటికీ ఈ సినిమాని ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్