సినిమాలకు.. రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. రాజకీయాల్లో రాణించాలంటే జనాకర్షక నేతగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ తర్వాతే లీడర్ గా ఎదగడం సాధ్యపడుతుంది. అయితే.. ఈ గుర్తింపు సినిమాల ద్వారా అప్పటికే వచ్చేసి ఉంటుంది కాబట్టి.. షార్ట్ కట్ లో పొలిటికల్ స్క్రీన్ పై హిట్ కొట్టే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది. అయితే.. అందరికీ సక్సెస్ సాధ్యం కాదు. కొందరు డిజాస్టర్ ను కూడా ఫేస్ చేస్తుంటారు. అయితే.. ఫిమేల్ యాక్టర్స్ రాజకీయాల్లోకి రావడం కాస్త అరుదుగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు హాట్ యాంకర్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.
ఆ యాంకర్ మరెవరో కాదు.. అటు బుల్లి తెరపై జబర్దస్త్ పాపులారిటీ సంపాదించుకొని, ఇటు బిగ్ స్క్రీన్ పైనా తనదైన ముద్ర వేస్తున్న అనసూయ భరద్వాజ్. ఈమె రోజా బాటలోనే నడవాలని చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇటు జబర్దస్త్ కామెడీ షో జడ్జ్ గా కూడా కొనసాగుతున్నారు.
Also Read: మేయర్ పీఠం.. ఎవరూ నోరెత్తకుండా.. కేసీఆర్ పక్కా ప్లాన్
టీడీపీలో ఉండి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన రోజా.. ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ విధంగా మొక్కవోని దీక్షతో పాలిటిక్స్ లో కూడా సక్సెస్ అయ్యారు రోజా సెల్వమణి. అంతేకాదు.. ‘ఏపీఐఐసీ’ చైర్మన్ గానూ కొనసాగుతున్న రోజా. అయితే.. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన జబర్దస్త్ ప్రోగ్రాంను మాత్రం వదులుకోవట్లేదు రోజా. ఇప్పుడు అనసూయ కూడా ఇదే విధంగా కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
అయితే.. ఇప్పుడే కాదు. గతంలోనూ అనసూయ రాజకీయాల్లో వస్తుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ.. అప్పుడు అనసూయ వాటిపై స్పందించలేదు. అయితే.. ఈ సారి మాత్రం కాస్త గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలో అభిమానులు కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.
Also Read: మంచిగుంటే బట్టకాల్చి మీదేస్తారు.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
అంతేకాదు.. ఇటు వైసీపీ, అటు టీఆర్ఎస్ తోపాటు బీజేపీ కూడా తమ పార్టీలోకి రావాలని అడుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు అనసూయతో చర్చలు జరిపినట్టు సమాచారం. రోజా కూడా వైసీపీలో చేరితో మంచి పదవి వచ్చేలా చూస్తానంటూ చెప్పిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
అయితే.. అనసూయ మాత్రం తర్జనభర్జన పడుతోందట. ఇప్పుడిప్పుడే వెండి తెరపై మంచి అవకాశాలు అందుకుంటోంది. రాజకీయాల్లోకి వెళ్తే ఒక వర్గానికి ఫిక్స్ అయిపోవాల్సి వస్తుందని భావిస్తోందంట. అందువల్ల.. కొంత కాలం వేచి చూస్తే ఎలా ఉంటుందీ అని సన్నిహితులతో చర్చిస్తోందట అనసూయ. నలుగురు నాలుగు సలహాలు ఇస్తుండడంతో ఎటూ తేల్చుకోలేకపోతోందట ఈ యాంకర్ కమ్ ఆర్టిస్ట్. మరి, ఫైనల్ గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది? పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.