భీమా కోరెగావ్‌లో జనవరి 1న జరిగిన హింస కేసులో పోలీసులు ఆగస్టులో ఫెరీరా, గొంజాల్వెజ్, భరద్వాజ్‌తోపాటు తెలుగు కవి వరవరరావు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాను కూడా అరెస్టు చేశారు. నిందితులు అగ్ర మావోయిస్టు నేతలతో సంప్రదింపులు జరిపినట్టు ఈమెయిల్స్ లభించినట్టు పోలీసులు చెప్పారు. తర్వాత దిల్లీ హైకోర్టు ఆదేశాలతో పోలీసులు గౌతమ్ నవ్‌లఖాను తమ కస్టడీ నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. 56 ఏళ్ల సుధా భరద్వాజ్ 30 ఏళ్లకు పైగా ఆదివాసీల హక్కుల సాధనకై పోరాడుతున్నారు. 78 ఏళ్ల వరవరరావు విరసం నేత, గౌతమ్ నవ్‌లఖా ప్రముఖ యాక్టివిస్ట్. ఆయన పౌరహక్కులు, మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కుల అంశాలపై పనిచేస్తున్నారు. అరుణ్ ఫెరీరా, వర్నెన్ గొంజాల్వెజ్ ఇద్దరూ న్యాయవాదులు. సుప్రీం కోర్టు ఈ ఐదుగురినీ అక్టోబర్ 25 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.
Also Read: బ్రేకింగ్:భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు!
భీమా కోరెగావ్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వాలని విరసం నేత వరవరరావు అల్లుళ్లకు ముంబై ఎన్‌ఐఏ పోలీసులు నోటీసులు పంపారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణలపై వరవరరావును కస్టడీలో పెట్టగా.. తాజాగా ఆయన అల్లుళ్లను కూడా సాక్ష్యం కోసం ముంబై రావాలని పిలవడం చర్చనీయాంశం అయింది. సెప్టెంబరు 9న విచారణకు రావాలని నోటీసులు అందాయని వరవర రావు అల్లుళ్లు సత్యనారాయణ, కూర్మనాథ్ కూడా ఈ మేరకు ధ్రువీకరించారు.
సీఆర్‌పీసీ సెక్షన్ 160, 91 కింద ఈ నోటీసులు చ్చారు. (160 సెక్షన్ కింద అనుమానం ఉన్న ఎవరినైనా సాక్ష్యం కోసం పోలీసులు పిలిపించవచ్చు. 91 సెక్షన్ కింద సాక్షాలుగా పత్రాలు వంటివి చూపమని కోరుతారు.) ప్రస్తుతం కె.సత్యనారాయణ హైదరాబాద్‌లోని ఇఫ్లు విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కూర్మనాథ్ హైదరాబాద్‌లో జర్నలిస్టుగా ఉన్నారు. 2018 ఆగస్టులో వరవరరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాల సేకరణలో భాగంగా సత్యనారాయణ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేశారు. పుణె నుంచి వచ్చిన పోలీసు బృందం ఆయన ఫ్లాట్లో తనిఖీలు చేపట్టింది. తనకు భీమా కోరెగావ్ కేసుతో సంబంధం లేదని సత్యనారాయణ వాదించినా పోలీసులు తనిఖీలు వదల్లేదు. ఆయనతోపాటే కూర్మనాథ్ ఇంట్లోనూ సోదాలు చేశారు.
Also Read: డ్రగ్ కేసులో స్టార్ల పేర్లను బయటపెట్టిన రియా చక్రవర్తి?
కేవలం వరవరరావు అల్లుణ్ణి కాబట్టే తనను మానసికంగా వేధిస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. ‘నేను వరవరరావుకు బంధువును అనేది వాస్తవం. కానీ నాకూ భీమా కోరెగావ్ అల్లర్లకూ ఏ సంబంధమూ లేదు’ అని సత్యనారాయణ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని.. కరోనాతోనూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వృద్ధాప్యం కావడంతో రకరకాల వ్యాధులు, సమస్యలు ఉన్నాయని, ఆయనకు ఇస్తున్న ట్రీట్‌మెంట్‌పై ఎలాంటి సమాచారమూ ఇవ్వడం లేదని ఇప్పటికే పలుమార్లు కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. ఆయన అభిమానులూ ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేయాలంటూ ప్రజాసంఘాలు కూడా విన్నవించాయి. ఇప్పటికే ఆయన క్షేమ సమాచారం తెలియక సతమతం అవుతున్న ఆయన కుటుంబానికి తాజాగా నోటీసులు రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ముంబైలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా అక్కడికి రావడం తమకు ఆందోళనగా ఉందని కూర్మనాథ్ మీడియాతో అన్నారు. విచారణకు రావాల్సిందేనని ముంబై పోలీసులు నోటీసులు ఇవ్వడం.. వైరస్ నేపథ్యంలో రాలేకపోతున్నామని వరవరరావు అల్లుళ్లు అంటుండడంతో కేసు ఎటు మలుపు తిరుగుతుందో తెలియకుండా ఉంది.