https://oktelugu.com/

రియా వెనుక బాలీవుడ్ హీరోలు?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి వెనుక ఎవరున్నారన్నది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.. రియా ఎదుగుదలను చూడలేక కొందరు బాలీవుడ్ హీరోలే రియాను పావుగా వాడి అతడిని నీరుగార్చారా? డ్రగ్స్ కు బానిసను చేసి అతడి మరణానికి కారణమయ్యారా? సోమవారం విచారణలో పలువురు బాలీవుడ్ హీరోల పేర్లను రియా వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. వారి పేర్లు మాత్రం బయటకు రాలేదు. Also Read: ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత దీన్ని బట్టి సుశాంత్ లాంటి […]

Written By: , Updated On : September 8, 2020 / 09:41 AM IST
Riya chakravarthy

Riya chakravarthy

Follow us on

Riya chakravarthyబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి వెనుక ఎవరున్నారన్నది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.. రియా ఎదుగుదలను చూడలేక కొందరు బాలీవుడ్ హీరోలే రియాను పావుగా వాడి అతడిని నీరుగార్చారా? డ్రగ్స్ కు బానిసను చేసి అతడి మరణానికి కారణమయ్యారా? సోమవారం విచారణలో పలువురు బాలీవుడ్ హీరోల పేర్లను రియా వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. వారి పేర్లు మాత్రం బయటకు రాలేదు.

Also Read: ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

దీన్ని బట్టి సుశాంత్ లాంటి వర్ధమాన నటుడిని ఎదగనీయకుండా బాలీవుడ్ హీరోలు కుట్రపన్నారనే వార్తలు మీడియాలో వెలువడున్నాయి. సుశాంత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు వెనుక ఎవరు ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలీవుడ్ స్టార్లు రియాను ప్రలోభ పెట్టి ఇలా చేశారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. సుశాంత్ మరణించడానికి మానసికంగా రియా ఇబ్బంది పెట్టిందా అనే విషయంలోనూ సీబీఐ ఆరాతీస్తోంది.

తాజాగా సోమవారం విచారణలో సుశాంత్ మృతి కేసులో బాలీవుడ్ స్టార్ల ప్రమేయంపై రియా నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ కేసు గొప్ప మలుపు తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: బిగ్ బాస్ 4 : ఈ సారి వారిదే డామినేషన్

సుశాంత్ సింగ్ కు తాను డ్రగ్స్ ఇచ్చానని రియా ఒప్పుకున్నట్టు సమాచారం. తన తమ్ముడు షోవిక్ ద్వారా డ్రగ్స్ తెప్పించి సుశాంత్ కు ఇచ్చానని రియా దర్యాప్తులో అంగీకరించినట్టు సమాచారం. దీంతో ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ఇచ్చానని.. తాను మాత్రం వాడలేదని రియా తెలిపినట్లు సమాచారం.   సుశాంత్ వ్యవహారంలో రియా పాత్ర ఉందని తేలడంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ముంబై పోలీసులు విచారించినా.. సీబీఐ విచారించినా ఈ కేసు తెగడం లేదు. రోజుకో విషయం బయటపడుతూ ఉత్కంఠ రేపుతోంది. సోమవారం ఎన్.సీ.బీ విచారణలో బాలీవుడ్ హీరోల పేర్లను రియా బయటపెట్టినట్టు సమాచారం.