అనుకున్నట్టే అవుతోంది. ఇన్నాళ్లు ఆయుధాలు వాడకూడదని నిర్ణయించుకున్న చైనా-భారత్ సరిహద్దుల్లో 60 ఏళ్ల తర్వాత కాల్పుల కలకలం చేసుకుంది. 1962 యుద్ధంలో భారత్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు తుపాకులు సరిహద్దుల్లో వాడకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా ముష్టిఘాతాలు, తలపడడాలు తప్పితే నేరుగా తుపాకులతో కాల్చుకోలేదు.
Aslo Read: డ్రగ్ కేసులో స్టార్ల పేర్లను బయటపెట్టిన రియా చక్రవర్తి?
తాజాగా చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తూర్పు లఢక్ లోని పాంగాంగ్ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపినట్లు సమాచారం.
అయితే తొలుత భారత్ కాల్పులు జరిపిందంటూ చైనా పశ్చిమ కమాండర్ బుకాయించాడు. అయితే చైనా కాల్పులు జరిపాకే భారత్ కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ తమ వాదనను సమర్థించుకున్నారు. దీనిపై భారత సైన్యం స్పందించలేదు.
కాగా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖను చైనా మార్చేందుకు ప్రయత్నిస్తుండడంతో భారత్ అడ్డుకుంటుంటోంది. పాంగాంగ్ సరస్సు సమీపంలో కీలక పర్వత ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా కుట్రలను భారత్ తిప్పికొడుతూ పర్వత ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటోంది.
Aslo Read: కీలక మలుపు: వరవరరావు అల్లుళ్లకు నోటీసులు
కాగా డ్రోన్ లతో భారత సైన్యంపై నిఘా వేసేందుకు చైనా పంపించిందని.. హెచ్చరించినా వినకపోవడంతోనే భారత్ కాల్పులు జరిపి ఉంటుందని తెలుస్తోంది. ఈ తాజా కాల్పులపై భారత్ సైన్యం అధికారికంగా స్పందించలేదు.