NH19 wall collapse near Memari: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మా పరిపాలన కాలంలో విశ్వగురులాగా అవతరించింది. ఐఐటి ల నుంచి మొదలుపెడితే ఆస్పత్రుల వరకు అన్నిట్లోనూ భారతదేశాన్ని మేము అగ్రగామిలాగా తీర్చి దిద్దుతున్నాం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే స్థానిక బిజెపి నాయకుల వరకు ఇదిగో ఇలానే మాట్లాడుతుంటారు.
వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. ముఖ్యంగా కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే భారత విశ్వ గురువు ఏమో గానీ.. చేస్తున్న అభివృద్ధి పనులలో మాత్రం దారుణంగా అవినీతి కనిపిస్తోంది. అక్రమం కళ్ళముందే దర్శనమిస్తోంది. ప్రధాన మీడియా అన్ని మూసుకున్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఇటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బిజెపి ప్రభుత్వం జాతీయ రహదారులకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచుతున్నామని అంటున్నది. నిధుల కేటాయింపు కూడా భారీగా చేపడుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో మాత్రం నాణ్యత కనిపించడం లేదు. పైగా చిన్నపాటి వర్షానికి రోడ్లు కొట్టుకుపోవడం.. నిర్మించిన బ్రిడ్జిలు కూలిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న తూర్పు బుర్ద్వాన్ ప్రాంతంలో నేషనల్ హైవే 19 నిర్మించారు. ఈ హైవే పై రాకపోకలు మొదలయ్యాయి. అయితే ఇటీవల ఈ హైవే ఉన్నట్టుండి కూలిపోయింది. నిర్మించిన బ్రిడ్జి చూస్తుండగానే నేల కూలిపోయింది. రక్షణ గోడ కూడా పిట్టగోడ మాదిరిగా కృంగిపోయింది . ఈ వీడియోను కొంతమంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు..” ఇదీ విశ్వ గురు అభివృద్ధి నమూనా. తూర్పు బుర్ద్వాన్ ప్రాంతంలో మెమారీ సమీపంలోని జాతీయ రహదారి 19 పరిస్థితి ఇలా ఉంది. ఈ వ్యవహారంలో కోత డబ్బును ఎవరు జేబులో వేసుకున్నారు? స్థానిక బిజెపి నాయకులా? కేంద్ర బిజెపి నాయకులా” అని కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల వేదిక గా ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
Viswaguru’s model of development!
Condition of National Highway 19 near Memari in East Burdwan.
Who has pocketed the cut money in this case – local BJP leaders or central BJP leaders? pic.twitter.com/Nlat5i2C5f
— Sandipan Mitra (@SMitra_) March 11, 2026