Ishan Kishan craze: కష్టపడే వాడికి దక్కే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రతికూలమైన ఫలితాలు వచ్చినప్పటికీ.. అంతిమంగా మాత్రం సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు వచ్చిన నాడు పడిన కష్టం మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది. కాకపోతే వచ్చిన ఫలితం గొప్పగా ఉన్న నేపథ్యంలో పడిన కష్టం కాస్త చిన్నదిగానే ఉంటుంది.
టీమిండియా ఇటీవల స్వదేశంలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో విజేతగా ఆవిర్భవించింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును ఓడించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాలలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది. ముఖ్యంగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అర్థ శతకాలు చేసి అదరగొట్టారు. టీమిండియా కు ఊహించని భారీ స్కోర్ అందించారు. ఫలితంగా టీమిండియా న్యూజిలాండ్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.
న్యూజిలాండ్ జట్టు మీద టీమ్ ఇండియా సాధించిన విజయంలో ఇషాన్ కిషన్ పాత్ర కూడా ఉంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ మాదిరిగానే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు కిషన్. న్యూజిలాండ్ బౌలర్ల పై ఆధిపత్యాన్ని కొనసాగించాడు. కిషన్ ఆడిన తీరు పట్ల మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఇషాన్ కిషన్ ఇలాంటి ఫామ్ కంటిన్యూ చేస్తే జట్టులో చోటు స్థిరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Also Read: Team india గెలిచినా టీ 20 వరల్డ్ కప్ ఇవ్వరు గాక ఇవ్వరు. ఇదేం ట్విస్ట్ రా అయ్యా
టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత ప్లేయర్లు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ సాధించిన సందర్భాన్ని రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రికెటర్లందరికి వారి వారి సొంత రాష్ట్రాలలో ఘనమైన స్వాగతం లభిస్తోంది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఇషాన్ కిషన్ కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. కిషన్ ఇంటి ఎదుట భారీగా అభిమానులు బారులు తీరారు. ముంబైలో అమితాబచ్చన్ కోసం.. షారుక్ ఖాన్ కోసం.. అమీర్ ఖాన్ కోసం అభిమానులు ఎలాగైతే ఎదురు చూస్తారో.. అలాగే కిషన్ కోసం అభిమానులు వేచి ఉన్నారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అమితాబ్ బచ్చన్.. షారుక్ ఖాన్ మాదిరిగానే.. ఇషాన్ కిషన్ రేంజ్ కూడా మారిపోయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Ishan Kishan has become Bihar’s biggest celebrity.
The crowd of supporters outside his Patna home is just like the one that gathers in Mumbai for the Khan brothers and Amitabh Bachchan.
He hunky accepts all love showered in him.❤️❤️
— Oxomiya Jiyori (@SouleFacts) March 11, 2026