రాయలసీమ ఎత్తిపోతలపై తెగని పేచీ

ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలే సవాలుగా మారుతున్న క్రమంలో ఇవాళ జాతీయ హరిత ట్రిబ్యునల్ సైతం అంతకుమించి సంచలనం చేస్తోంది. సీమ లిఫ్ట్ పరిశీలనకు కృష్ణా నదీ బోర్డు అధికారుల్ని జగన్ ప్రభుత్వం అనుమతించడంతో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇవాళ హరిత ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై ఎన్టీటీలోవాదనాలు కొనసాగాయి. కృష్ణా నదీ బోర్డు అధికారుల్ని […]

Written By: Srinivas, Updated On : July 23, 2021 4:24 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలే సవాలుగా మారుతున్న క్రమంలో ఇవాళ జాతీయ హరిత ట్రిబ్యునల్ సైతం అంతకుమించి సంచలనం చేస్తోంది. సీమ లిఫ్ట్ పరిశీలనకు కృష్ణా నదీ బోర్డు అధికారుల్ని జగన్ ప్రభుత్వం అనుమతించడంతో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇవాళ హరిత ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై ఎన్టీటీలోవాదనాలు కొనసాగాయి. కృష్ణా నదీ బోర్డు అధికారుల్ని రాయలసీమ రాయలసీమ లిఫ్ట్ దగ్గరకు అనుమతించకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహించింది. దీంతో ఏపీ న్యాయవాది కౌంటర్ దాఖలు చేస్తామని ఎన్జీటీకి తెలిపింది. ఎన్జీటీ మాత్రం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇవాళ విచారణ చేపట్టింది. సీమ లిఫ్ట్ కువ్యతిరేకంగా వేసిన పిటిషన్ పై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ జరిపింది. పిటిషనర్లు నోళ్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తమ వాదనలు వినిపించారు ఏపీ ప్రభుత్వం, కృష్ణా నదీ బోర్డు తమ అఫిడవిట్లు దాఖలయ్యాయి. ఇందులో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు సందర్శనకు ఏపీ ప్రభుత్వం నిరాకరించడం లేదని కృష్ణా బోర్డు తమ అఫిడవిట్లో పేర్కొంది. దీనిపై ఏపీ సర్కారు కౌంటర్ దాఖలుచేస్తామని తెలిపింది.

రాయలసీమ పథకంపై పనులు ఏవీ జరగడం లేదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి చెప్పింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర జలసంఘం అడిగిన అంశాలపై అధ్యయనం జుగుతోందని వివరించింది. అయితే ఎన్జీటీ బృందం పర్యటించాలని ఏపీ కోరింది. ఇందుకు హెలికాప్టర్ తో సహా అన్ని సహకారాలు అందిస్తామని పేర్కొంది. దీంతో జగన్ ప్రభుత్వం వద్దన్నా మా హెలికాప్టర్ లో వెళ్లాలని కోరింది.

కృష్ణా బోర్డు అధికారుల్ని రాయలసీమ ప్రాజెక్టు వద్దకు అనుమతించకూడదన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఎన్జీటీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండానే అక్కడికి వెళ్లాలని కృష్ణాబోర్డును ఆదేశించింది. కృష్ణా బోర్డు నివేదిక ఆధారంగానే చర్యలుఉంటాయని హరిత ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.