Next Prime Minister Yogi Adityanath: కేంద్రంలో ఇప్పుడు బీజేపీకి తిరుగులేదు.. మోడీకి ఎదురులేదు. ప్రధాని మోడీ వయసు 70 ఏళ్లు దాటుతోంది. మరో దఫా మాత్రమే ఆయన దేశానికి సేవలు అందించగలరు.. మరి తర్వాత ఎవరు బీజేపీ తరుఫున ప్రధాని అభ్యర్థి అంటే.. ఇన్నాళ్లు అందరూ దేశంలో మోడీ తర్వాత స్థానంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరునే చెబుతున్నారు. మోడీకి ప్రధాన సహచరుడు, గుజరాతీ కావడంతో భావి ప్రధాని అమిత్ షా అని అనుకున్నారు.
కానీ అమిత్ షానే ఈ ప్రతిపాదనపై సంచలన కామెంట్స్ చేశారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్ షా తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు భవిష్యత్ ప్రధాని ఎవరన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. భావి ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ను ప్రజలు భావించడం సహజమని అన్నారు. యూపీలో 80 ఎంపీ సీట్లు ఉండడంతో ఢిల్లీకి మార్గం లక్నో నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. 2024లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా యూపీలో గెలిచి తీరాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటే యూపీనే పరిగణలోకి తీసుకోవాల్సిందేనని చెప్పారు.
Also Read: KCR National Politics: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!
ఉత్తర ప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం. అందుకే అక్కడ గెలుపు బీజేపీకి అత్యవసరం. ఇన్నాళ్లు కేంద్రంలో మోడీ తర్వాత అమిత్ షానే ప్రధాని అనుకున్నారు.కానీ పార్టీ గెలుపు కోసం అమిత్ షా ఇప్పుడు తన ప్రధాని పదవిని కలను కూడా త్యాగం చేసినట్టుగా అర్థమవుతోంది. పార్టీ గెలిస్తే ‘యోగి’యే నెక్ట్స్ ప్రధాని అని సంచలన ప్రకటన వెనుక అక్కడి సామాజికవర్గాలను, యూపీలో బీజేపీ గెలుపును ఆశించి చేసి ఉంటారని అర్థమవుతోంది.
యూపీ బీజేపీ చేజారితే దేశంలో సింగిల్ మెజార్టీతో గెలిచే చాన్సులు లేవు. అందుకే యోగిపై వ్యతిరేకత ఉన్నా కంటిన్యూ చేశారు. ఫుల్ పవర్స్ ఇచ్చారు. యోగి ఇప్పుడక్కడ బలమైన నేతగా ఎదిగారు. యోగిని తప్పించే సాహసం కేంద్రం చేయడం లేదు. ఆయన ద్వారానే ఓట్లు రాబట్టుకునే ఎత్తుగడ వేసింది. ఈక్రమంలోనే అమిత్ షానే స్వయంగా భవిష్యత్ ప్రధాని యోగి అని చెప్పి యూపీ ఓటర్ల మనసు దోచేశారు. మరోసారి గెలిపించేందుకు ఈ ఎత్తుగడ వేశారు. మరి అమిత్ షా ప్రకటన యూపీలో బీజేపీకి ఓట్లు రాలుస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.