https://oktelugu.com/

Samantha: ఇప్పుడు చైతును అడక్కర్లేదుగా సామ్.. పెళ్లి చేసుకుందామా ?

Samantha: సమంత నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి.. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తోంది. ఐతే ఆ ఆశలు, ఆశయాల వెనుక అనేక కష్టాలు ఉన్నాయని ఆమె ఈ మధ్య తరుచూ ఎమోషనల్ అవుతూ చెప్పడం అందర్నీ కదిలిస్తోంది. సామ్ తన జీవితంలో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు అనుభవించింది. మనసుకు గాయం అయినప్పుడు మందు మనసే అని చెబుతుంది. ఒంటరితనం బాధ పెడితే.. మరో తోడు కోసం ప్రయత్నం చేయాలని సామ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 2, 2022 / 12:56 PM IST
    Follow us on

    Samantha: సమంత నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి.. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తోంది. ఐతే ఆ ఆశలు, ఆశయాల వెనుక అనేక కష్టాలు ఉన్నాయని ఆమె ఈ మధ్య తరుచూ ఎమోషనల్ అవుతూ చెప్పడం అందర్నీ కదిలిస్తోంది. సామ్ తన జీవితంలో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు అనుభవించింది. మనసుకు గాయం అయినప్పుడు మందు మనసే అని చెబుతుంది.

    Samantha

    ఒంటరితనం బాధ పెడితే.. మరో తోడు కోసం ప్రయత్నం చేయాలని సామ్ గతంలో ఓ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్ ను నెటిజన్లు సామ్ కి షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. గతంలో ఓ నెటిజన్ సమంత బోల్డ్ ఫోటోలు చూసి తెగ ముచ్చట పడుతూ.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన సామ్ అప్పుడు ‘అతనికి తనదైన శైలిలో ఆన్సర్ ఇస్తూ.. ‘చైతును అడుగు. ఆయనకు ఇష్టం అయితే చేసుకుంటాను’ అంటూ కామెంట్ పెట్టింది.

    Also Read:  దుల్కర్ తో తన స్నేహం గురించి చెప్పిన చైతు

    అయితే, గతంలో సమంత – ఓ నెటిజ‌న్ మధ్య జరిగిన ఈ చర్చ ‘సామ్ నువ్వు నాగ‌చైత‌న్యకు విడాకులు ఇచ్చెయ్‌, మనం పెళ్లి చేసుకుందాం’ అని ఉంది. అప్పుడు ఆ నెటిజన్ ఏమంటా మెసేజ్ చేశాడో గానీ, ఇప్పుడు అదే నిజం అయ్యింది. ఇక ఇప్పుడు సామ్ ఒంటరిగా ఉంటుంది. మరి ఆ నెటిజన్.. మళ్ళీ సమంతకి మెసేజ్ చేస్తున్నాడట. ఇప్పుడు చైత‌న్య‌ను కూడా అడిగే అవసరం లేదు. ఏమంటావ్ సామ్.. పెళ్లి చేసుకుందామా ? అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.

    Samantha Serious Counter To Netizen

    మరి సమంత అతనికి ఎలాంటి రిప్లై ఇస్తోందో చూడాలి. ఇక సామ్ ప్రస్తుతం సినిమాల పై తన ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే, ‘సమంత’కు చైతుతో పెళ్లికి ముందు సినిమాకి ఎనభై లక్షల నుండి కోటి రూపాయిలు వరకూ ఇచ్చేవారు. పెళ్లి తరువాత హీరోయిన్ కి అవకాశాలే ఇవ్వరు, అలాంటిది కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంది సామ్. నిజానికి పెళ్లి తర్వాత సమంతకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. సావిత్రి లాంటి మహానటి కూడా ముప్పై ఐదేళ్ళు దాటగానే సైడ్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది.

    కానీ ఆ ఆనవాయితీని సమంత బ్రేక్ చేసింది. పైగా పెళ్లి తరువాతే సమంత కెరీర్ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. అయితే, సామ్ విడాకుల దిశగా పయనం కొనసాగిస్తుంది కాబట్టి.. ప్రస్తుతం బోల్డ్ పాత్రలకు కూడా సై అంటుంది. కానీ, ఆమెకు డిమాండ్ మాత్రం గతంలో ఉన్నట్టు లేదు. చైతుతో కలిసి ఉన్నప్పుడు ఉన్న డిమాండ్.. ఒంటరి అయ్యాక పోయింది. అదేంటో గానీ.. మొదటి నుంచి సామ్ కి అంత రివర్స్ లోనే జరుగుతుంది.

    Also Read:   వర్మ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన విజయలక్ష్మి

    Tags