Avatar 3: హాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలను చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులలో జేమ్స్ కామెరూన్ ఒకరు…ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపైతే ఉంది. ఇక అలాంటి దర్శకుడి డైరెక్షన్ లో వచ్చిన ‘అవతార్’ సినిమా ఎంతటి ప్రభంజనాన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక అవతార్ సెకండ్ పార్ట్ వచ్చి ప్రేక్షకులను అంత పెద్దగా మెప్పించలేకపోయింది. రీసెంట్ గా అవతార్ 3 సైతం రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఎమోషన్ చాలా వరకు మిస్ అయిందని చెబుతున్నారు. విజువల్ గా ఈ సినిమా బాగుంది. గ్రాండియర్ విజువల్స్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పటికి అవతార్ మొదటి పార్ట్ చూపించినంత ఇంపాక్ట్ ను ఈ సినిమా చూపించలేక పోయిందంటూ చాలామంది ఈ సినిమా మీద విమర్శలు చేస్తున్నారు.
ఫైర్ అండ్ యాడ్ గా వచ్చిన ఈ సినిమా మీద ఇండియాలో అంత పెద్ద ప్రమోషన్స్ కూడా చేయలేదు. అవతార్ 3 సినిమా భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందనుకుంటే చాలావరకు డీలా పడిపోవడం ఆ సినిమా అభిమానులతో పాటు జేమ్స్ కామెరూన్ ను తీవ్రమైన నిరాశకు గురి చేస్తుందనే చెప్పాలి… అవతార్ 3 విషయంలో జేమ్స్ కామెరూన్ తీవ్రమైన తప్పులైతే చేశారు…
సీన్స్ కి సీన్ కు మధ్య ఫ్లో కూడా అంత పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఒక సీను దేని గురించి జరుగుతోందో ఆ తర్వాత సీన్ దానిమీద కాకుండా వేరే దాని మీద ఓపెన్ చేయడం ఎమోషన్స్ ని సైతం హ్యాండిల్ చేయలేకపోయారని అనిపించింది. ప్రేక్షకుడి ధోరణిలో ఆలోచించి సినిమా చేస్తే బాగుండేది.
అలా కాకుండా జేమ్స్ కామెరూన్ దర్శకత్వ ప్రతిభను చూపించుకునే ప్రయత్నం మాత్రమే చేశాడు…ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోలేక పోయింది అనేది వాస్తవం…తర్వాత రాబోయే అవతార్ 4 సినిమాతో అయిన జేమ్స్ కామెరూన్ ప్రేక్షకులను మెప్పిస్తాడా? మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…