https://oktelugu.com/

Rana Daggubati Rejected Movies: రానా ఇన్ని సూప‌ర్ హిట్ మూవీలు వ‌దులుకున్నాడా.. అవ‌న్నీ చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడేమో..

Rana Daggubati Rejected Movies: సినిమా ఇండ‌స్ట్రీలో హీరోలు చాలా బిజీగా ఉంటారు. ఒక సినిమాకు ముందు క‌మిట్ కావ‌డంతో.. ఆ త‌ర్వాత వ‌చ్చిన మూవీల‌ను డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌నో.. మ‌రే ఇత‌ర కార‌ణాల‌తోనే వ‌దిలేస్తారు. అలా వ‌దిలేసిన‌వి ఇత‌ర హీరోలు చేసి పెద్ద హిట్ అయితే ఆ బాధ అంతా ఇంతా కాదు క‌దా. అయితే రానా కూడా ఇలాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌ను వ‌దిలేసుకున్నాడు. నిజానికి అవ‌న్నీ చేసి ఉంటే సౌత్ లోనే సూప‌ర్ స్టార్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 2, 2022 / 01:06 PM IST
    Follow us on

    Rana Daggubati Rejected Movies: సినిమా ఇండ‌స్ట్రీలో హీరోలు చాలా బిజీగా ఉంటారు. ఒక సినిమాకు ముందు క‌మిట్ కావ‌డంతో.. ఆ త‌ర్వాత వ‌చ్చిన మూవీల‌ను డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌నో.. మ‌రే ఇత‌ర కార‌ణాల‌తోనే వ‌దిలేస్తారు. అలా వ‌దిలేసిన‌వి ఇత‌ర హీరోలు చేసి పెద్ద హిట్ అయితే ఆ బాధ అంతా ఇంతా కాదు క‌దా. అయితే రానా కూడా ఇలాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌ను వ‌దిలేసుకున్నాడు. నిజానికి అవ‌న్నీ చేసి ఉంటే సౌత్ లోనే సూప‌ర్ స్టార్ అయ్యేవాడేమో.

    అయితే త‌మిళంలో రానాకు పెద్ద ఆఫ‌ర్ వ‌చ్చింది. తన్ని ఒరువన్ మూవీలో ముందుగా రానాను అడిగారంట డైరెక్ట‌ర్ మోహన్ రాజా. కానీ బాహుబ‌లితో బిజీగా ఉండ‌టంతో దీన్ని ప‌క్క‌న పెట్టేశాడు. కానీ అదే మూవీని జయం రవి చేసి మంచి హిట్ కొట్టాడు. ఇక ఆ త‌ర్వాత పటాస్ మూవీ ముందుగా రానా వ‌ద్ద‌కే వ‌చ్చింద‌ట‌. అనిల్ రావిపూడి అడిగితే కాద‌న్నాడంట‌. కానీ క‌ల్యాణ్ రామ్‌కు కెరీర్ ట‌ర్నింగ్ లా మారింది ఆ మూవీ.

    Also Read:   ఇప్పుడు చైతును అడక్కర్లేదుగా సామ్.. పెళ్లి చేసుకుందామా ?

    శ‌ర్వానంద్ హీరోగా హను రాఘవపూడి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ప‌డిప‌డి లేచే మ‌న‌సు క‌థ‌ను ముందుగా రానాకు చెప్పారంట‌. కానీ రానాకు క‌థ న‌చ్చ‌క ప‌క్క‌న పెట్టేసాడంట‌. అది శ‌ర్వానంద్‌కు ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో తెలిసిందే. ఇక క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ జాగర్లమూడి రాయ‌బారి అనే క‌థ‌ను రాసుకున్నాడంట‌. ఈ క‌థ‌ను రానాకు చెప్ప‌గా.. రిజెక్ట్ చేశాడంట‌. ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ కూడా వ‌ద్ద‌ని చెప్ప‌డంతో.. ఆ క‌థ‌ను ప‌క్క‌న పెట్టాడు క్రిష్‌.

    ఇక ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ తేజ డైరెక్ట్ చేసిన సీత మూవీకి ముందుగా రానాను అనుకున్నాడంట తేజ‌. కానీ అనారోగ్యం కార‌ణంగా అప్పుడు ఈ మూవీని చేయ‌లేదు రానా. త‌మిళంలో మంచి హిట్ కొట్టిన వేధ‌ సినిమాను తెలుగులో బాబాయ్ వెంక‌టేశ్ తో క‌లిసి రానాను న‌టించాల‌ని అడిగారంట‌. కానీ ఇందుకు రానా నో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన సర్కార్ 3లో రానాకు న‌టించే అవ‌కాశం వ‌చ్చిందంట‌. కానీ రానా వ‌ద్ద‌ని చెప్పాడు.

    Rana Daggubati

    ఇక తండ్రి సురేష్ బాబు ప్రొడక్షన్స్ లో రానా ఓ కొత్త డైరెక్ట‌ర్ తో సినిమా తీయాల‌ని అనుకున్నారంట‌. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల క‌థ రెడీ అయిపోయాక క్యాన్సిల్ అయిందంట‌. ఇక సిద్ధార్థ్ హీరోగా చిత్రం మూవీని తీసి సంచ‌ల‌న విజ‌యం అందుకున్న మిలింద్ రావు ఒక సినిమాను రానాతో తీయాల‌ని అనుకున్నారంట‌. కానీ అమెరికాలో ట్రీట్ మెంట్ లో ఉండ‌టం వ‌ల్ల‌.. రానా ఆ మూవీని వ‌దులుకున్నాడంట‌. అయితో భ‌విష్య‌త్ లో మాత్రం ఆయ‌న‌తో సినిమా చేద్దామ‌ని రానా వెయిట్ చేస్తున్నాడంట‌. ఇలా రానా వ‌దులుకున్న సినిమాలు అన్నీ సూప‌ర్ హిట్ అయిన‌వే.

    Also Read: దుల్కర్ తో తన స్నేహం గురించి చెప్పిన చైతు

    Recommended Video: 

     

    Tags