Ustaad Bhagat Singh Trailer Date: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్… మిరపకాయ్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో వరుస బ్లాక్ బాస్టర్లను అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ కి 10 సంవత్సరాల తర్వాత భారీ సక్సెస్ ని అందించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక మరోసారి పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ రిపీట్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో రాబోతున్న ఈ సినిమా కోసం హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ ఇద్దరు భారీ కసరత్తులైతే చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ ప్రేక్షకులందరిని ఆకర్షించింది. ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుండడం విశేషం..
ఆ సాంగ్ మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు తార స్థాయికి వెళ్లిపోయాయి. ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయినప్పటికి సినిమా రిలీజ్ మాత్రం 2026 మార్చి లో ఉంటుందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక సంక్రాంతి కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి హరీష్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. తను అనుకున్నట్టుగానే సంక్రాంతికి ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తే మాత్రం ఈ సినిమా మీద అంచనాలు మరో లెవల్ కి వెళ్ళిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక హరీష్ శంకర్ రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఫ్లాప్ అయింది.
కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తేనే అతను మరోసారి టైర్ వన్ హీరోలతో సినిమాలు చేయడానికి అర్హత సాధిస్తాడు. లేకపోతే మాత్రం అతన్ని పట్టించుకునే హీరోలు ఉండరు. ఇక పవన్ కళ్యాణ్ సైతం రీసెంట్ గా ఓజీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లను అందుకున్న హీరోగా నిలుస్తాడు…