Janasena : ఏపీలో జనసేన ఊపు మొదలైంది. మార్చి 14న ఏపీలో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభ కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ కళ్యాణ్.. దీని నిర్వహణ బాధ్యతల కోసం సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో కమిటీలు వేశారు. ఈ సభను భారీగా నిర్వహించుకునేందుకు ఇప్పటికే చాలా మంది నేతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం 12 కమిటీల నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీల్లో మరికొందరి నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు.
ఆవిర్భావ సభ మార్చి 14కు ముందు ఆ పార్టీకి మంచి ఊపు వస్తోంది. ప్రజల్లోకి వెళ్లడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలనుకుంటున్న జనసేనకు ఈ పరిణామం కలిసి వచ్చేలా ఉంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. మార్చి 14న జనసేనాని పవన్ పార్టీ ఆవిర్భావ దినాన ఎలాంటి తూటాలు వదలుతాడు? ఏపీ ప్రభుత్వాన్ని ఎలా షేక్ చేస్తాడన్నది ఉత్కంఠగా మారింది.
జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కోసం తాజాగా కొత్తగా చేర్చిన సభ్యుల వివరాలు…
-జిల్లాల సమన్వయ కమిటీ
• నూకల నారాయణరావు
• భోగిరెడ్డి కొండల రావు
• సంగిశెట్టి అశోక్
• వాసిరెడ్డి శివ
• తలాటం సత్య
• ఆకుల మణికుమార్
• ఆహ్వాన కమిటీ
• మల్లినీడి తిరుమలరావు(బాబీ)
క్యాటరింగ్ కమిటీ
• పి.వి.ఎస్.ఎన్. రాజు
మెడికల్ అసిస్టెన్స్ కమిటీ
• డాక్టర్ క్రిస్టాపరపు సతీష్
మీడియా కో ఆర్డినేషన్ కమిటీ
• ఆకుల కిరణ్ కుమార్
• బొలిశెట్టి వంశీకృష్ణ
• తిరుమలశెట్టి నరేష్
• పులిగడ్డ నాగేశ్వరరావు
• బాదర్ల శివనాగకుమార్
• ఇంజరపు సూర్య
పబ్లిసిటీ కమిటీ
• గాదె వెంకటేశ్వరరావు
సెక్యూరిటీ కమిటీ
• ఆర్.డి.ఎస్. ప్రసాద్
• మేకల తేజ
• వినయ్
• మేడిద శ్రీను
• కొండా చిన్ని
• కె. సాయి సూర్య
• పెదమళ్లు మణికంఠ
• వి. సతీష్ కుమార్
• శివ ప్రసాద్ రెడ్డి
• ఏడిద భార్గవ్
• బేతు చైతన్య కృష్ణ
వాలంటీర్ల కమిటీ
• గుండా జయప్రకాశ్ నాయుడు
• నల్లగోపుల చలపతిరావు
• ఆనంద్ సాగర్