Land Registrations In Hyderabad: ప్రభుత్వానికి భారగా ఆదాయం వచ్చే శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఒకటి. అయితే ఈ శాఖలో రిజిస్ట్రేషన్ ఫీజులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నజర్ పెడుతూనే ఉంటుంది. దీని నుంచి పెద్ద ఆదాయం రావడమే ఇదుకు బలమైన కారణం. అందుకే కేసీఆర్ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఫీజులను పెంచారు.

కానీ కరోనా తర్వాత ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోవడంతో రిజిస్ట్రరేషన్ ఫీజులను విపరీతంగా పెంచేశారు. దీంతో ఆటోమేటిక్ గా భూముల విలువ పెరిగింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగినప్పుడు.. ఆ నష్టాన్ని భూముల రేటు పెంచి పూడ్చడం కామనే కదా. ఈ కారణాల వల్ల తెలంగాణకు మణిహారం అయిన హైదరాబాద్ లో ఇండ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి.
Also Read: ఏపీ ఆర్థిక బడ్జెట్ ప్రత్యేకతలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే..?
ఇదే విషయాన్ని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించిదంఇ. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయిన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి లాంటి ప్రాంతాల్లో ఫిబ్రవరిలో 25శాతం మేర ఇండ్ల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయంట.ఎంతలా తగ్గిపోయాయంటే.. రూ.25లక్షలు ఉన్న ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 2021 ఫిబ్రవరిలో 2888 యూనిట్లు ఉండగా.. ఈ సారి మాత్రం 844యూనిట్లు మాత్రమే ఉన్నాయి.

దీనంతటికీ కారణం 2022లో రెండు సార్లు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడమే అని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించింది. ఇండ్ల ధరలు బాగా పెరిగాయని, సామాన్య జనం కొనడం తగ్గించేశారని వెల్లడించింది. కరోనా వల్ల చాలామంది ప్రజలు ఆర్థికంగా నష్టపోవడం వల్ల కొత్తగా ఏ ప్రాపర్టీలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్లనే ఇలా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినట్టు ఈ సంస్థ స్పష్టం చేసింది.
Also Read: ఐదు రాష్ట్రాల ఫలితాలపై కేసీఆర్ మౌనం.. అసలు కారణం ఇదే